ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పిన సంగతి తెలిసిందే. సూపర్ సిక్స్ పేరుతో ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒకటి దీపం పథకం. ఏడాదిలో మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే పథకమే దీపం పథకం. దీపావళి నుంచి దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించనుంది. ఇక ఈ పథకానికి ఎవరు అర్హులనే దానిపై వివరాలను సైతం పౌర సరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇటీవల వెల్లడించారు. కాగా తాజాగా.. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి ప్రభుత్వం కీలక ఉత్తర్వులు ఇచ్చింది. సబ్సిడీ నిధులు విడుదల చేసింది. లబ్దిదారులకు ఇవ్వాల్సిన ఒక సిలిండర్ సబ్సిడీ మొత్తం రూ.895 కోట్లను విడుదలకు పాలనానుమతి ఇచ్చింది. దీపావళి పండుగను పురస్కరించుకుని అక్టోబరు 31 తేదీన ఒక ఉచిత సిలిండర్‌ను ప్రభుత్వం లబ్దిదారులకు ఇవ్వనుంది.
Read Also: Akkineni Nageswara Rao Last Message: ANR చివరి మాటలు.. కన్నీళ్లు పెట్టుకున్న చిరంజీవి
ఏడాదికి మూడు ఉచిత ఎల్పీజీ సిలిండర్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లకు రూ.2684 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. అలాగే.. గ్యాస్ కంపెనీలు, పౌరసరఫరాల శాఖ సంయుక్తంగా తెరిచిన అకౌంటుకు ఈ మొత్తం నిధుల జమ కానుంది. ఉచిత సిలిండర్‌కు సంబంధించిన నిధులు డీబీటీ ద్వారా జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా నగదు బదిలీతో లబ్దిదారు ఖాతాకు జమ కానుంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి జి.వీరపాండియన్ ఉత్తర్వులు జారీ చేశారు.
Read Also: Cyber Security Awareness : సైబర్ నేరాలపై భారత సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కీలక సూచనలు