NTV Telugu Site icon

Bride Kidnap: పెళ్లి కూతురుని కారులో ఎత్తుకెళ్లిన బంధువులు.. ఎందుకంటే..

Kidnap

Kidnap

ఇటీవల సోషల్ నెట్‌వర్క్‌లలో పెళ్లికి సంబంధించిన కొన్ని వార్తలు, వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. చాలా మంది వధూవరులు తమ వివాహాన్ని గుర్తుండిపోయేలా చేయడానికి వివిధ రకాల పనులు చేస్తారు. ఈ సమయంలో కొందరు వధూవరులు తమ వింత ప్రవర్తనతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. తాజాగా ఓ పెళ్లికి సంబంధించిన ఓ వింత వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో, వధువు పెళ్లి అంనతరం తమతో వచ్చేందుకు నిరాకరించిందని బంధువులు ఏకంగా కిడ్నాప్ చేసి మరి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

IND vs SA: సౌతాఫ్రికాతో మ్యాచ్.. సెంచరీతో చెలరేగిన స్మృతి మంధాన

వధూవరులకు వివాహం ముగిసిన తర్వాత.. వధువు తల్లిదండ్రుల ఇంటి వద్ద బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆ సమయంలో వధువు కన్నీళ్లు పెట్టుకుని వరుడితో వెళ్లనని చెప్పింది. పెళ్లికూతురు తమతో వెళ్లేందుకు నిరాకరించడంతో బంధువులు వెంటనే కారులో ఎక్కించేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో కొందరు యువకులు వధువును కాళ్లు, చేతులు పట్టుకుని కారులో ఎక్కించుకున్నారు.

OnePlus Nord CE 4 Lite : వన్ ప్లస్ నుంచి మరో కొత్త ఫోన్.. పీచర్స్, ధర ఎంతంటే?

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వధువు పెద్దగా కేకలు వేయడం ఈ వీడియోలో కనపడుతుంది. ఈ వీడియో ను చూసిన ఇంటర్నెట్ వినియోగదారులు వివిధ స్టైల్స్ లో స్పందిస్తారు. వీడ్కోలు పలుకుతూ.. కిడ్నాప్ చేసి తీసుకెళ్లారంటూ కొందరు సరదాగా వ్యాఖ్యలు చేసారు.