Site icon NTV Telugu

Rekha Nayak : నేడు కాంగ్రెస్‌ గూటికి రేఖానాయక్‌..

Rekha Nayak

Rekha Nayak

బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ రానున్న అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితాను నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. అభ్యర్థుల ప్రకటిస్తూ తాను కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు కేసీఆర్‌.. ఇదే సమయంలో.. బోథ్‌, ఖానాపూర్‌, వైరా, కోరుట్ల, ఉప్పల్‌, ఆసిఫాబాద్‌, వేములవాడ నియోజకవర్గాల అభ్యర్థుల విషయంలో ఏడు మార్పులు చేర్పులు చేసినట్లు ఆయన వెల్లడించారు. నాంపల్లి, నర్సాపూర్, గోషామహల్, జనగాం నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థిత్వాన్ని పెండింగ్‌లో ఉంచిన కేసీఆర్‌ తర్వాత ప్రకటిస్తానని వెల్లడించారు.

Also Read : NCL Recruitment 2023: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 338 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..

అయితే.. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ ప్రస్తుత ఎమ్మెల్యే రేఖా నాయక్‌ స్థానంలో కేటీఆర్‌ మిత్రుడు భూక్య జాన్సన్‌కు అవకాశం ఇచ్చింది బీఆర్‌ఎస్‌ అధిష్టానం. దీంతో.. రేఖానాయక్‌ బీఆర్‌ఎస్‌ గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే నిన్న రాత్రి రేఖానాయక్‌ భర్త అజ్మీరా శ్యామ్‌ నాయక్‌ రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహరాల ఇంచార్జీ మాణిక్‌ రావు థాక్రే సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో నేడు రేఖానాయక్‌ కూడా కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇదిలా ఉంటే.. రేఖానాయక్‌తో పాటు మరికొందరు బీఆర్‌ఎస్‌ అసమ్మతి నేతలు కూడా పార్టీనీ వీడే ఆవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టికెట్లు ఆశపడి భంగపడ్డ నేతలను బుజ్జగించేందుకు బీఆర్‌ఎస్‌ పెద్దలు ప్రయత్నాలు చేస్తారో.. లేక మిన్నకుంటారో చూడాలి మరి.

Also Read : Multibagger Stock: నేడు రికార్డు స్థాయికి చేరుకున్న స్టాక్.. మూడేళ్లలో ఇన్వెస్టర్లను కోటీశ్వరులను చేసింది

అయితే.. రేఖా నాయక్ 2009లో రాజకీయాల్లోకి ప్రవేశించి భారత జాతీయ కాంగ్రెస్ తరపున ఆసిఫాబాద్ జెడ్పీటీసీ మెంబర్ గా పోటీచేసి విజయం సాధించింది. 2013లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి, తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్రను పోషించింది. 2014లో ఖానాపూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రితేష్ రాథోడ్ పై 30వేల మెజారిటీతో విజయం సాధించింది. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రమేష్ రాథోడ్ పై 24,300 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది.

Exit mobile version