Site icon NTV Telugu

Rekha Jhunjhunwala: జాక్‌ పాట్‌ అంటే ఆమెదే.. నిమిషాల వ్యవధిలో రూ.500 కోట్ల సంపాదన..

Rekha Jhunjhunwala

Rekha Jhunjhunwala

Rekha Jhunjhunwala: స్టాక్‌ మార్కెట్లు ఎప్పుడు ఎవరిని ధనవంతులను చేస్తాయో.. ఎప్పుడు ఎవరి చేతికి చిప్ప ఇస్తాయో కూడా చెప్పడం కష్టం.. ఓ కంపెనీకి ఉన్న బ్రాండ్‌ను బట్టి షేర్‌ విలువ పెరగడం.. పడిపోవడం జరుగుతూనే ఉంటుంది.. కొన్నిసార్లు ఆ కంపెనీలు చేసే చిన్న పొరపాట్లు కూడా షేర్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంటాయి.. ఇదంతా ఎందుకు గానీ.. ఓ మహిళ జాక్‌ పాట్‌ కొట్టేసింది.. నిమిషాల వ్యవధిలోనే ఏకంగా రూ.500 కోట్లు సంపాదించుకుంది.. ఆమె ఎవరో కాదు.. భారత స్టాక్ మార్కెట్‌లో ప్రధాన పెట్టుబడిదారు, దివంగత రాకేష్‌ జున్‌జున్‌వాలా భార్య..

ప్రధానంగా బంగారు ఆభరణాలను విక్రయించే టైటాన్ గత ఏడాది కంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 20 శాతం ఆదాయాన్ని పెంచుకుంది.. ఇలా శుక్రవారం స్టాక్ మార్కెట్ ప్రారంభమైన వెంటనే టాటా గ్రూప్‌నకు చెందిన టైటాన్ కంపెనీ షేర్ల విలువ ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి ఎగబాకి సరికొత్త రికార్డును సృష్టించాయి.. టైటాన్ షేర్లు రాత్రిపూట 3 శాతం పెరిగాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభంలో టైటాన్ షేరు 3.39 శాతం ఎగసింది. దీంతో కంపెనీ షేరు గరిష్టంగా రూ.3, 211.10కి చేరింది. ఇక, కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆల్ టైమ్ హై రూ.9,357 కోట్లకు ఎగబాకింది. రూ.275,720 కోట్ల నుంచి రూ.2,85,077 కోట్లకు ఎగసింది.

టైటాన్ షేర్ల విలువ విజృంభించడంతో దివంగత జున్‌జున్‌వాలా భార్య రేఖా జున్‌జున్‌వాలా రూ. 500 కోట్లు సంపాదించుకున్నట్టు అయ్యింది.. టైటాన్‌లో రేఖకు 5.29 శాతం వాటా ఉంది. ఈ సందర్భంలో టైటాన్ కంపెనీ షేర్లు పెరగడంతో రేఖ వద్ద ఉన్న షేర్ల విలువ రూ.500 కోట్ల కొత్త స్థాయికి చేరుకుంది. ఒక ప్రైవేట్ కంపెనీ ప్రచురించిన నివేదిక ప్రకారం, ఆమె కలిగి ఉన్న వివిధ షేర్లలో ఒక నిర్దిష్ట కంపెనీకి చెందిన ఒక షేర్ మార్కెట్ విలువ రూ. 15,080.57 అత్యధికంగా పేర్కొంది. మరోవైపు.. టైటాన్ వాచీలు మరియు చేతి గడియారాలు గత సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత సంవత్సరం చివరి త్రైమాసికంలో 13 శాతం వృద్ధిని కనబరిచాయి. ఇక, తన వ్యాపారాన్ని మరింత విస్తృతం చేస్తూ.. టైటాన్ గత త్రైమాసికంలో 18 కొత్త అవుట్‌లెట్‌లను ప్రారంభించింది.. దీంతో ఆ కంపెనీ అవుట్‌లెట్‌ల మొత్తం సంఖ్య 559కి చేరుకుంది.

Exit mobile version