Delhi Terror Blast Case: ఢిల్లీ ఉగ్రవాద పేలుడు కేసులో కీలక పరిణామం.. నలుగురు వైద్యుల రిజిస్ట్రేషన్ రద్దు
- ఢిల్లీ ఉగ్రవాద పేలుడు కేసులో కీలక పరిణామం
- ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డ నలుగురు వైద్యుల రిజిస్ట్రేషన్ రద్దు
- నేషనల్ మెడికల్ కౌన్సిల్ (NMC) కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కార్ బ్లాస్ట్ భయాందోళనకు గురిచేసింది. ఈ ఘటనను ఉగ్రవాద చర్యగా కేంద్ర ప్రకటించింది. తాజాగా ఢిల్లీ ఉగ్రవాద పేలుడు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డ నలుగురు వైద్యుల రిజిస్ట్రేషన్ రద్దు చేసింది. ఢిల్లీ టెర్రర్ బ్లాస్ట్ కేసు దర్యాప్తు నేపథ్యంలో జమ్మూ & కాశ్మీర్ పోలీసుల నుండి వచ్చిన సమాచారం, రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సమర్పించిన నివేదికలను పరిశీలించిన అనంతరం, నేషనల్ మెడికల్ కౌన్సిల్ (NMC) కీలక నిర్ణయం తీసుకుంది.
Also Read:Nitish Kumar: విమర్శలు కాదు… నితీష్ కుమార్ విజయాలను చూడండి..
Also Read
ఆరోపణలు, దర్యాప్తు వివరాలను పరిగణనలోకి తీసుకుని డాక్టర్ ముజాఫర్ అహ్మద్, డాక్టర్ అదీల్ అహ్మద్ రాదర్, డాక్టర్ ముజమ్మిల్ షకీల్, డాక్టర్ షాహీన్ సయీద్ ల ఇండియన్ మెడికల్ రిజిస్ట్రీ (IMR), నేషనల్ మెడికల్ రిజిస్ట్రీ (NMR) లోని రిజిస్ట్రేషన్‌ను వెంటనే అమలులోకి వచ్చేలా రద్దు చేసినట్లు NMC ప్రకటించింది. అలాగే, ఈ నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్ర మెడికల్ కౌన్సిల్స్‌కు అధికారికంగా తెలియజేయనున్నట్లు కూడా NMC స్పష్టం చేసింది. ఈ పరిణామంతో, ఆయా వైద్యులు ఇకపై భారతదేశంలో వైద్య వృత్తిని నిర్వహించే అర్హత కోల్పోయినట్టే అవుతుంది. దర్యాప్తు పురోగతిలో ఇది ఒక కీలక మలుపుగా భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
-
Babar Azam: ‘శనగలు అమ్మడానికి వచ్చావా..?’ పాపం బాబర్ ఆజం పరువుపోయిందిగా..
-
AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
-
Drugs Seized : ఒడిశా టూ హైదరాబాద్ ‘డెడ్ డ్రాప్’ డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు
-
Mohammed Siraj: కెప్టెన్‌గా మహ్మద్ సిరాజ్ ఎంపిక.. అక్టోబర్ 11న తొలి మ్యాచ్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!