NTV Telugu Site icon

High Court: లోకేష్ పోస్టు చేసిన వీడియో ఆధారంగా కేసు నమోదు చేయడం సరికాదు: పిన్నెల్లి తరఫు న్యాయవాది

Ap High Court

Ap High Court

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. సంఘటన ఈనెల 13న జరిగితే.. 15న ఎఫ్‌ఐఆర్‌ రిజిస్టర్ చేశారని ఎమ్మెల్యే పిన్నెల్లి తరపున న్యాయవాది నిరంజన్‌రెడ్డి తన వాదనలు వినిపించారు. “నారా లోకేష్ X లో evm ధ్వంసం చేసిన వీడియో పోస్ట్ చేశారు. దీనిని ఆధారంగా కేసు నమోదు చేయటం జరిగింది. నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ కు వెళ్లటం సరికాదు. ఎన్నికల కమిషన్ అరెస్ట్ చేయాలని నేరుగా ఆదేశాలు ఇవ్వటం సరికాదు. లోకేష్ X లో పెట్టిన వీడియో ఆధారంగా ఇదంతా చేస్తున్నారు. EVM ధ్వంసం విషయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇది చేశారని విధుల్లో ఉన్న పీఓ చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసిన FIR లో కూడా ఇదే అంశాలు ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్న నారా లోకేష్ X లో ఒక వీడియో ను పోస్ట్ చేశారు. అది మార్ఫింగ్ వీడియో కూడా అయ్యే అవకాశం ఉంది.” అని వాధించారు. పిటిషనర్ పలు సుప్రీం కోర్టు జడ్జిమెంట్ లను కొట్ చేశారు. ఏడేళ్ళ లోపు శిక్ష పడే అవకాశం ఉన్న సేక్షన్లుతో నమోదు చేసిన ఈ కేసులో నోటీసు ఇవ్వచ్చని సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పులో ఉందని స్పష్టం చేశారు. కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని కోరిన ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాది కోరారు. సింగిల్ బెంచ్‌లో న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి డివిజనల్ బెంచ్‌లో న్యాయమూర్తి కావడంతో అక్కడ విచారణ ఉందని పిటిషన్‌పై విచారణ కొద్దిసేపు వాయిదా వేశారు. ఇంకా పోలీసుల తరపున న్యాయవాది వాదనలు వినిపించాల్సి ఉంది.

READ MORE: AP High Court: ఐపీఎస్ అధికారి ఏబీ పిటిషన్ పై హైకోర్టులో 2గంటలుగా కొనసాగుతున్న విచారణ

కాగా.. కాగా.. మాచర్ల ఈవీఎం ధ్వంసం ఘటనపై సీరియస్ అయిన సీఈసీ.. ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లిని అరెస్ట్‌ చేయాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఆయనను అరెస్ట్‌ చేసేందుకు ప్రత్యేక బృందాలు హైదరాబాద్‌కు వెళ్లాయి. పల్నాడు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఈ బృందాలను ఏర్పాటు చేశారు. ఏపీ పోలీసులు, తెలంగాణ స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఈ గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ జరుగుతోంది.