NTV Telugu Site icon

Regina Cassandra : కాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రెజీనా..

Whatsapp Image 2023 08 17 At 4.42.16 Pm

Whatsapp Image 2023 08 17 At 4.42.16 Pm

యంగ్ హీరోయిన్ రెజీనా కసాండ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ ఎస్ఎంఎస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది.ఆ సినిమాలో సుధీర్ బాబు హీరో గా నటించాడు. తన అద్భుతమైన నటనతో తెలుగులో ఈ భామ వరుస సినిమాలు చేసింది .టాలీవుడ్ యంగ్ హీరోల సరసన నటించి మెప్పించింది. తన నటన, గ్లామర్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. రెజీనా తమిళంతో పాటు ఇటు తెలుగులో కూడా సినిమాలు చేస్తోంది. అయితే ఈ భామ కెరీర్ అంత సాఫిగా సాగడం లేదు.. ఈ భామకు ప్రస్తుతం పెద్ద సినిమా ఆఫర్స్ అంతగా రావడం లేదు.. చివరిగా ఈ భామ ‘శాకినీ డాకినీ’ సినిమాతో ప్రేక్షకులను అలరించింది.అలాగే ఈ ముద్దుగుమ్మ తెలుగులో చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమా లో ఐటెం సాంగ్ కూడా చేసింది.ప్రస్తుతం కోలీవుడ్ లోనే సినిమాలు చేస్తోంది.

ప్రస్తుతం ఈ భామ తమిళంలోనే మూడు చిత్రాల్లో నటిస్తూ వరుస షూటింగ్స్ తో బిజీగా ఉంది.ఈ భామ తాజాగా ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా తను కాస్టింగ్ కౌచ్ గురించిషాకింగ్ వ్యాఖ్యలు చేసింది.రెజీనా మాట్లాడుతూ తాను కూడా కాస్టింగ్ కౌచ్ సమస్యను ఎదుర్కొన్నట్టు చెప్పుకొచ్చింది.ఆమె మాట్లాడుతూ.. కెరీర్ ప్రారంభంలో అవకాశాల కోసం నేను కొంత మందిని అప్రోచ్ అయ్యాను. వారిలో ఒకరు ఫోన్ చేసి నాకు సినిమా ఛాన్స్ ఇస్తామనని చెప్పారు. కానీ అడ్జస్ట్ మెంట్ కు ఓకే అంటేనే తర్వాత షూటింగ్ పని చూసుకోవచ్చని వారు అన్నారు. ముందు నాకు అతని అంటున్న మాటలు అస్సలు అర్థం కాలేదు.అప్పటికీ నాకు అడ్జస్ట్ మెంట్ అంటే ఏంటో కూడా తెలియదు. ఏదో రెమ్యునరేషన్ విషయం మాట్లాడుతున్నారేమో అని, నా మేనేజర్ మీతో మాట్లాడుతారు అని నేను ఫోన్ కట్ చేశాను. ఇది దాదాపు పది సంవత్సరాల ముందు జరిగింది.. అప్పుడు నాకు 20 ఏళ్ల వయస్సు ఉంటుంది.’ అని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రెజీనా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి.

Show comments