Regina Cassandra : కాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రెజీనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరోయిన్ రెజీనా కసాండ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ ఎస్ఎంఎస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది.ఆ సినిమాలో సుధీర్ బాబు హీరో గా నటించాడు. తన అద్భుతమైన నటనతో తెలుగులో ఈ భామ వరుస సినిమాలు చేసింది .టాలీవుడ్ యంగ్ హీరోల సరసన నటించి మెప్పించింది. తన నటన, గ్లామర్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. రెజీనా తమిళంతో పాటు ఇటు తెలుగులో కూడా సినిమాలు చేస్తోంది. అయితే ఈ భామ కెరీర్ అంత సాఫిగా సాగడం లేదు.. ఈ భామకు ప్రస్తుతం పెద్ద సినిమా ఆఫర్స్ అంతగా రావడం లేదు.. చివరిగా ఈ భామ ‘శాకినీ డాకినీ’ సినిమాతో ప్రేక్షకులను అలరించింది.అలాగే ఈ ముద్దుగుమ్మ తెలుగులో చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమా లో ఐటెం సాంగ్ కూడా చేసింది.ప్రస్తుతం కోలీవుడ్ లోనే సినిమాలు చేస్తోంది.
ప్రస్తుతం ఈ భామ తమిళంలోనే మూడు చిత్రాల్లో నటిస్తూ వరుస షూటింగ్స్ తో బిజీగా ఉంది.ఈ భామ తాజాగా ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా తను కాస్టింగ్ కౌచ్ గురించిషాకింగ్ వ్యాఖ్యలు చేసింది.రెజీనా మాట్లాడుతూ తాను కూడా కాస్టింగ్ కౌచ్ సమస్యను ఎదుర్కొన్నట్టు చెప్పుకొచ్చింది.ఆమె మాట్లాడుతూ.. కెరీర్ ప్రారంభంలో అవకాశాల కోసం నేను కొంత మందిని అప్రోచ్ అయ్యాను. వారిలో ఒకరు ఫోన్ చేసి నాకు సినిమా ఛాన్స్ ఇస్తామనని చెప్పారు. కానీ అడ్జస్ట్ మెంట్ కు ఓకే అంటేనే తర్వాత షూటింగ్ పని చూసుకోవచ్చని వారు అన్నారు. ముందు నాకు అతని అంటున్న మాటలు అస్సలు అర్థం కాలేదు.అప్పటికీ నాకు అడ్జస్ట్ మెంట్ అంటే ఏంటో కూడా తెలియదు. ఏదో రెమ్యునరేషన్ విషయం మాట్లాడుతున్నారేమో అని, నా మేనేజర్ మీతో మాట్లాడుతారు అని నేను ఫోన్ కట్ చేశాను. ఇది దాదాపు పది సంవత్సరాల ముందు జరిగింది.. అప్పుడు నాకు 20 ఏళ్ల వయస్సు ఉంటుంది.’ అని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రెజీనా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి.
Also Read
- Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
- CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
తాజావార్తలు
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
-
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!