Amazon Sale: దీపావళి క్లీనింగ్ భయం అక్కర్లేదు.. రూ. 3వేల లోపే లభిస్తున్న బెస్ట్ 2-ఇన్-1 వాక్యూమ్ క్లీనర్ మీకోసం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amazon Great Indian Festival Sale: దీపావళి పండుగ వచ్చేస్తుందంటే చాలు, మనమందరం ఇళ్ల శుభ్రతలో బిజీ అయిపోతాం. అయితే, ఎంత ఊడ్చినా ఇంటి మూలలు, సోఫాలు, కార్పెట్లు, కార్ల సీట్లు వంటి చోట్ల పేరుకుపోయిన ధూళిని తొలగించడం మామూలు విషయం కాదు. ఇలాంటి పనులన్నింటినీ ఎంతో సులభం చేయడానికి సరిగ్గా సరిపోయే 2-ఇన్-1 వాక్యూమ్ క్లీనర్ ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో కేవలం రూ. 3,000 లోపే లభిస్తోంది.
అమెజాన్‌లో అందుబాటులో ఉన్న ‘రెఫైర్ క్లీన్జెట్ సిఎక్స్80’ (Reffair Cleanjet CX80) వాక్యూమ్ క్లీనర్ అసలు ధర రూ. 5,000 కాగా, సేల్ ఆఫర్ కింద ఇది రూ. 3,030కే అందుబాటులో ఉంది. అంతేకాకుండా, సెలెక్టెడ్ బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగిస్తే అదనంగా మరో వెయ్యి రూపాయల వరకు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఈ వాక్యూమ్ క్లీనర్ ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో 2-ఇన్-1 డిజైన్ లభిస్తుంది. దీన్ని అవసరాన్ని బట్టి స్టిక్ మోడ్ లేదా హ్యాండ్‌హెల్డ్ మోడ్‌లో ఉపయోగించుకోవచ్చు. స్టిక్ డిజైన్ సాయంతో నేలలను సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. అలాగే, హ్యాండ్‌హెల్డ్ మోడ్‌లో చేతితో పట్టుకుని చిన్న చిన్న మూలలు, సోఫాలు, ఇతర ఉపరితలాలపై ఉన్న దుమ్మును సులువుగా తొలగించవచ్చు.
Also Read
- ఇంట్లోనే హోమ్ థియేటర్.. TCL 65 అంగుళాల 4K Google TV పై రూ. 60,000 భారీ డిస్కౌంట్..!
- HP Star Book Air 14: HP Star Book Air 14 ల్యాప్‌టాప్ లాంచ్.. OLED టచ్‌స్క్రీన్, 42.5 గంటల బ్యాటరీ బ్యాకప్!
- CNAP Rules: నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఆ యాప్స్ ఇక వేస్టేనా?
- 8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
దీని పనితీరు విషయానికి వస్తే, ఈ వాక్యూమ్ క్లీనర్‌లో 17 కేపీఏ (kPa) సక్షన్ పవర్‌తో పాటు సైక్లోనిక్ టెక్నాలజీని అందించారు. దీనివల్ల నేలలు, సోఫాలు, కార్పెట్లపై ఉన్న మురికిని బలంగా లాగేస్తుంది. ఫర్నిచర్ చుట్టూ పేరుకుపోయే దుమ్మును వదిలించడానికి ఇది చక్కగా పనిచేస్తుంది. అయితే ఇది వైర్లెస్ కాదు, కేబుల్‌తో పనిచేస్తుంది. దీని పవర్ కార్డ్ పొడవు దాదాపు 5 మీటర్లు ఉంటుంది కాబట్టి, వాడేటప్పుడు దగ్గర్లో పవర్ సాకెట్ ఉండేలా చూసుకోవాలి. అలాగే ఇందులో డస్ట్ కంటైనర్ వస్తుంది, దుమ్ము నిండిన తర్వాత దాన్ని సులభంగా ఖాళీ చేయవచ్చు. దీపావళి శుభ్రతను సులభతరం చేసుకోవడానికి తక్కువ బడ్జెట్లో మంచి వాక్యూమ్ క్లీనర్ కోరుకునే వారికి ఇది చక్కటి ఆప్షన్. అయితే కొనుగోలు చేయడానికి ముందు దీని ప్రస్తుత ధర, ఫీచర్లు మరియు వారంటీ వివరాలను ఒకసారి సరిచూసుకోవడం మంచిది.
తాజావార్తలు
-
Box Office War: టాలీవుడ్లోనే అనుకుంటే.. కోలీవుడ్‌లో మరింత హెవీ కాంపిటీషన్!
-
Amazon Sale: దీపావళి క్లీనింగ్ భయం అక్కర్లేదు.. రూ. 3వేల లోపే లభిస్తున్న బెస్ట్ 2-ఇన్-1 వాక్యూమ్ క్లీనర్ మీకోసం..
-
Arshdeep Singh: వైట్ బాల్ స్టార్ టు రెడ్ బాల్ స్పెషలిస్ట్.? టెస్టు అరంగేట్రానికి రంగం సిద్ధం..! బౌలింగ్ కోచ్ కీలక వ్యాఖ్యలు..
-
Jamia University: జామియా యూనివర్సిటీలో విద్యార్థుల నిరాహార దీక్ష ముగింపు.. ఎన్నికలపై కీలక ప్రకటన!
-
Maredumilli Fire Accident: మారేడుమిల్లిలో భారీ అగ్నిప్రమాదం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం, ప్రాణనష్టం!
ట్రెండింగ్
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!
-
ఇంట్లోనే హోమ్ థియేటర్.. TCL 65 అంగుళాల 4K Google TV పై రూ. 60,000 భారీ డిస్కౌంట్..!
-
Harmanpreet Kaur: కెప్టెన్సీ లేకపోతేమి.. బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేయడమే నా లక్ష్యం..! హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు.!
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!