Site icon NTV Telugu

Redya Naik : చంద్రబాబును జైల్లో పెట్టి హింసించడం సరైందికాదు

Redya Naik

Redya Naik

14 ఏళ్లు ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు ప్రతిపక్షనేతగా ఆంధ్ర ప్రదేశ్ కు సేవలందించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసి తీవ్రంగా హింసించి ఇబ్బందులకు గురి చేయడం జగన్ సర్కారు తిరు సరైంది కాదని డోర్నకల్ బి.అర్.ఎస్ ఎమ్మెల్యే డి.ఎస్ రెడ్యా నాయక్ అన్నారు. మంగళవారం మరిపెడ మండల కేంద్రంలోని స్థానిక నవీన్ రావు గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి ,74 ఏళ్ల చంద్రబాబును ఇబ్బందులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read : Medigadda Barrage : సంచలనం రేపుతున్న మేడిగడ్డ బ్యారేజ్‌ పిల్లర్‌ ఘటన

ఇది సరైన చర్య కాదని రెడ్యా నాయక్ హితువు పలికారు.చంద్రబాబు ఏ తప్పు చేయకపోయినా.. అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టిన జగన్ ప్రభుత్వం ఆంధ్ర తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను వైసీపీ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేయాలని చూస్తోందని ఆరోపించారు. అంతేకాక తమ పార్టీ శ్రేణులను అనగదొక్కాలనీ చూస్తోందని, ఈ అణచవేత ధోరణితో తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరింత రెచ్చగొడుతుందని విమర్శించారు. అది జగన్ కే ప్రమాదంమాని ఆయన చరిత్రను గుర్తు చేశారు. ఏదేమైనా ప్రజారంజకంగా పాలన కొనసాగాల్సిన సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ కు శాపంగా మారడందురదృష్టకరమన్నారు. ఈ సమావేశంలో బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Also Read : ISRO Chief : గగన్‌యాన్‌లో మహిళా వ్యోమగాములు, సైంటిస్టులకు ప్రాధాన్యం

Exit mobile version