NTV Telugu Site icon

Redmi Smart Fire TV 4K: రెడ్‌మీ నుంచి సరికొత్త స్మార్ట్‌ టీవీ.. తక్కువ ధరలో సూపర్ ఫీచర్స్!

Redmi Smart Fire Tv 4k

Redmi Smart Fire Tv 4k

Redmi Smart Fire TV 4K 43 Inch price is Rs 26,999 in India: చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ షియోమీకి చెందిన ‘రెడ్‌మీ’.. స్మార్ట్‌ఫోన్ రంగంలోనే కాదు టీవీ రంగంలోనూ దూసుకెళుతోంది. సామాన్యులకు కూడా అందుబాటులో ధరలో స్మార్ట్‌ టీవీలను అందిస్తోన్న రెడ్‌మీ.. తాజాగా సరికొత్త స్మార్ట్‌ టీవీని మార్కెట్‌లో రిలీజ్‌ చేసింది. అమెజాన్‌ ఓఎస్‌ ద్వారా పని చేసే ‘ రెడ్‌మీ ఫైర్‌ 4కే టీవీ’ని తీసుకొచ్చింది. ఈ టీవీని కంపెనీ 43 ఇంచెస్ వెర్షన్‌లో రిలీజ్‌ చేసింది. ఈ టీవీ అమెజాన్‌తో పాటు ఎంఐ వెబ్‌సైట్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. అయితే ఈ టీవీ విక్రయ తేదీని మాత్రం రెడ్‌మీ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.

రెడ్‌మీ ఫైర్‌ 4కే టీవీ 43 ఇంచెస్ (108 సీఎం) స్క్రీన్‌తో వస్తుంది. ఈ టీవీ ‘ఫైర్‌ ఓఎస్‌’ ద్వారా పని చేస్తంది. వివిడ్ పిక్చర్ ఇంజిన్ టెక్నాలజీతో 4కే అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్ డిస్‌ప్లేను ఇందులో అందించారు. 24 వాట్స్‌ స్పీకర్లు, డాల్బీ ఆడియోతో పాటు డీటీఎస్‌ వెర్షన్లకు ఇది సపోర్ట్‌ చేస్తుంది. ఈ టీవీ వర్చువల్ ఎక్స్‌ టెక్నాలజీని కలిగి ఉంది. రెడ్‌మీ ఫైర్‌ 4కే టీవీ టీవీ క్వాడ్ కోర్ ఏ 55 ప్రాసెసర్‌ ద్వారా రన్ అవుతుంది.

Also Read: IND Playing 11 vs SL: అక్షర్, శ్రేయాస్ ఔట్.. తిలక్‌ డౌటే! శ్రీలంకతో ఆడే భారత్ తుది జట్టు ఇదే

రెడ్‌మీ ఫైర్‌ 4కే టీవీ సూపర్‌ స్లిమ్‌ డిజైన్‌తో మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. అమెజాన్‌తో భాగస్వామ్యం కారణంగా ఈ టీవీ అలెక్సాతో వస్తుంది. బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ, డ్యూయల్-బ్యాండ్ వైఫైని ఈ టీవీ సపోర్ట్ చేస్తుంది. ఇందులో పిక్చర్-ఇన్-పిక్చర్ టెక్నాలజీని కూడా కంపెనీ పరిచయం చేస్తుంది. ఈ టీవీ అసలు ధర రూ. 26,999గా ఉంది. అయితే పరిమిత సమయం వరకు మాత్రం రూ. 24,999 ప్రత్యేక ధరతో అందుబాటులో ఉంటుంది.

Show comments