Site icon NTV Telugu

Redmi A2 Amazon Offres: అమెజాన్‌లో అదిరే ఆఫర్.. రూ. 6499కే రెడ్‌మీ ఏ2 స్మార్ట్‌ఫోన్!

Redmi A2

Redmi A2

Buy Redmi A2 Smartphone Just Rs 6499 in Amazon: మీ బడ్జెట్ తక్కువగా ఉందా?.. రూ. 10 వేలలోపు ధరలో మంచి స్మార్ట్‌ఫోన్ కోసం వెతుకుతున్నారా?.. అయితే మీకో గుడ్ న్యూస్. రెడ్‌మీ ఏ2 స్మార్ట్‌ఫోన్‌ను ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. రూ. 6499కే రెడ్‌మీ ఏ2ను మీరు ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. ఎలాంటి బ్యాంకు, ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ లేకుండానే ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇంత తక్కువ ధరలో కొనేసుకోవచ్చు. అమెజాన్‌లో ఇటీవలి రోజుల్లో వరుస ఆఫర్స్ ఉంటున్న విషయం తెలిసిందే.

రెడ్‌మీ ఏ2 ఫోన్ అసలు ధర రూ. 8999గా ఉంది. అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌పై 28 శాతం తగ్గింపు ఆఫర్ ఉంది. దాంతో మీరు రెడ్‌మీ ఏ2ను కేవలం రూ. 6499కే సొంతం చేసుకోవచ్చు. అంటే ఈ స్మార్ట్‌ఫోన్‌పై మీరు రూ. 2,500 ఆదా చేసుకోవచ్చు. ఇక అమెజాన్‌ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా 5% క్యాష్‌బ్యాక్ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు మరి రూ. 10 వేలలోపు మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలంటే ఇప్పుడే కొనేసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Also Read: Jacques Kallis: 48 ఏళ్ల వయసులో ఆ కొట్టుడేంది సామీ.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రెడ్‌మీ ఏ2 స్మార్ట్‌ఫోన్‌ 6.52 ఇంచెస్ హెచ్‌డీ+ (1600 x 720 పిక్సెల్స్)ఎల్‌సీడీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో ఆండ్రాయిడ్ 13పై పని చేస్తుంది. ఈ ఫోన్‌లో 120Hz టచ్ శాంప్లింగ్ రేటు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ హీలియో G36 ప్రాసెసర్, 8 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా, సెల్ఫీ మరియు వీడియో కాలింగ్ కోసం 5-మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ ర్యామ్‌ను 7GB వరకు పెంచుకోవచ్చు. 64 GB వరకు స్టోరేజ్ ఉంది. మైక్రో SD ద్వారా 512 GB వరకు విస్తరించవచ్చు. రెడ్‌మీ ఏ2లో 5000mAh భారీ బ్యాటరీ ఉంది. ఇది 10W ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

Exit mobile version