Site icon NTV Telugu

Redmi 12 5G Price: అమెజాన్‌‌లో 23 శాతం తగ్గింపు ఆఫర్.. 15 వేలకే రెడ్‌మీ 5జీ స్మార్ట్‌ఫోన్ టాప్ వేరియంట్‌!

Redmi 12 5g New

Redmi 12 5g New

Amazon Offers on Redmi 12 5G Smartphones: నిత్యం బడ్జెట్‌ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లను విడదల చేస్తూ.. భారత మార్కెట్‌లో కస్టమర్లను ఆకట్టుకుంటున్న మొబైల్ సంస్థ ‘ఎంఐ’. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ ఉండే స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తున్న ఎంఐ.. రెడ్‌మీ 12 (Redmi 12 5G) 5జీ ఫోన్‌ను మంగళవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్‌ 4G, 5G వేరియంట్లలో అందుబాటులో ఉంది. నేటి (ఆగస్టు 4) నుంచి రెడ్‌మీ 12 ఫోన్‌లు ఈ కామర్స్ దిగ్గజాలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లతో పాటు షావోమి ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ స్టోర్లలో అందుబాటులోకి వచ్చాయి.

Redmi 12 5G Price Offers:
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్‌ జరుగుతోంది. ఈ సేల్‌లో రెడ్‌మీ 12 5జీ స్మార్ట్‌ఫోన్‌లపై 23 శాతం తగ్గింపు ఆఫర్ ఉంది. రెడ్‌మీ 12 5జీ టాప్ వేరియంట్‌ (Redmi 12 5G Moonstone Silver 8GB 256GB) ఫోన్ అసలు ధర అమెజాన్‌‌లో రూ. 19,999గా ఉంది. 23 శాతం తగ్గింపు తర్వాత ఈ ఫోన్.. రూ. 15,499లకు మీకు అందుబాటులో ఉంది. అంటే మీరు నేరుగా రూ. 4500 ఆదా చేసుకోవచ్చు. అలానే Redmi 12 5G Jade Black 8GB 256GB, Redmi 12 5G Pastel Blue 8GB 256GB స్మార్ట్‌ఫోన్లపై కూడా రూ. 4500 తగ్గింపు ఉంది.

Also Read: Mukesh Kumar Debut: వికెట్ ఏమీ పడగొట్టకున్నా.. రెండో భారత ఆటగాడిగా ముఖేష్‌ కుమార్‌ అరుదైన రికార్డు!

Redmi 12 5G Price Exchange Offer:
రెడ్‌మీ 12 5జీ ఫోన్‌లపై బ్యాంక్, ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. అమెజాన్ పే ఐసీసీ క్రెడిట్ కార్డుపై రూ. 300 క్యాష్‌బ్యాక్ మరియు రూ. 2,200 వెల్కమ్ రివార్డ్‌లు ఉన్నాయి. ఇక ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ రూ. 14,724 వరకు ఉంది. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్‌ చేస్తే.. రెడ్‌మీ 12 5జీ ఫోన్‌ను రూ. 1000 కంటే తక్కువ ధరలో మీ సొంతం అవుతుంది. అయితే మీ పాత స్మార్ట్‌ఫోన్‌ ఎలాంటి డామేజ్ లేకుండా.. కండీషన్ బాగుంటేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

Redmi 12 5G Price Features:
రెడ్‌మీ 12 స్మార్ట్‌ఫోన్‌లో 90 హెర్జ్‌ రిఫ్రెష్ రేట్‌, కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌తో 6.79 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎమ్‌ఐయూఐ 14 ఓఎస్‌తో ఈ ఫోన్ రన్ అవుతుంది. స్నాప్‌డ్రాగన్‌ 4 జెన్‌ 2 ప్రాసెసర్‌ను ఇది కలిగి ఉంటుంది. వెనుక వైపు 50 ఎంపీ మెయిన్ కెమెరాతో పాటు 8 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీ కోసం ముందుభాగంలో 8 ఎంపీ కెమెరాను ఇచ్చారు. ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. ఇది 22.5 వాట్ ఫాస్ట్‌ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఐపీఎస్స్ 53 వాటర్‌ రెసిస్టెన్స్, సైడ్‌ ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Also Read: Andy Flower RCB Coach: ఆర్‌సీబీ హెడ్‌ కోచ్‌గా జింబాబ్వే మాజీ క్రికెటర్.. ఇక కప్పు ఖాయం!

Exit mobile version