NTV Telugu Site icon

Redmi 12 5G Launch: 11 వేలకే రెడ్‌మీ 5జీ స్మార్ట్‌ఫోన్.. 50 ఎంపీ కెమెరా, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ!

Redmi 12 5g

Redmi 12 5g

Redmi 12 5G and Redmi 12 4G Smartphones Launch in India: తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ ఉండే స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తున్న మొబైల్ సంస్థ ‘ఎంఐ’. నిత్యం బడ్జెట్‌ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లను విడదల చేస్తూ కస్టమర్లను తెగ ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో ఎంఐ కంపెనీ రెడ్‌మీ బ్రాండ్‌లో ఓ కొత్త 5జీ ఫోన్‌ను మంగళవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. రెడ్‌మీ 12 (Redmi 12 5G) పేరుతో పరిచయం చేసిన ఈ ఫోన్‌.. 4G, 5G వేరియంట్లలో అందుబాటులో ఉంది. రెడ్‌మీ 12తో పాటు రెడ్‌మీ వాచ్‌ 3 (Redmi Watch 3), షావోమి స్మార్ట్‌ టీవీ ( Xiaomi Smart TV)లను కూడా కంపెనీ విడుదల చేసింది. రెడ్‌మీ 12 ధర, ఫీచర్ల వివరాలను ఓసారి చూద్దాం.

Redmi 12 5G Display:
రెడ్‌మీ 12 స్మార్ట్‌ఫోన్‌లో 90 హెర్జ్‌ రిఫ్రెష్ రేట్‌, కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌తో 6.79 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎమ్‌ఐయూఐ 14 ఓఎస్‌తో ఈ ఫోన్ రన్ అవుతుంది. 4G వేరియంట్‌లో మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్‌ను, 5G వేరియంట్‌లో స్నాప్‌డ్రాగన్‌ 4 జెన్‌ 2 ప్రాసెసర్‌ను అందించారు. రెడ్‌మీ 12 స్మార్ట్‌ఫోన్ 8 రకాల 5G బ్యాండ్‌విడ్త్‌లను సపోర్ట్ చేస్తుంది.

Also Read: WI vs IND 3rd ODI: వెస్టిండీస్‌పై భారీ విజయం.. ప్రపంచంలోనే ఏకైక జట్టుగా భారత్!

Redmi 12 5G Camera:
రెడ్‌మీ 12 స్మార్ట్‌ఫోన్‌లో వెనుక వైపు 50 ఎంపీ మెయిన్ కెమెరాతో పాటు 8 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీ కోసం ముందుభాగంలో 8 ఎంపీ కెమెరాను ఇచ్చారు. ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. ఇది 22.5 వాట్ ఫాస్ట్‌ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఐపీఎస్స్ 53 వాటర్‌ రెసిస్టెన్స్, సైడ్‌ ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Redmi 12 5G Price:
రెడ్‌మీ 12 4G వేరియంట్‌లో 4 జీబీ ర్యామ్‌/128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 8999గా ఉండగా.. 6 జీబీ/ 128 జీబీ ధర రూ. 10999గా ఉంది. అదే 5G వేరియంట్‌లో అయితే 4 జీబీ/128 జీబీ ధర రూ. 10999 కాగా.. 6 జీబీ/128 జీబీ ధర రూ. 12499గా ఉంది. ఇక రెడ్‌మీ 12 5G 8 జీబీ/ 256 జీబీ ధర రూ. 14999గా ఉంది. రెడ్‌మీ 12 4G, 5G స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు ఆగస్టు 4 నుంచి అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లతో పాటు షావోమి ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ స్టోర్లలో ప్రారంభం కానున్నాయి.

Also Read: Tomoto Price Today: కిలో టమాటా రూ.224.. మదనపల్లిలో నయా రికార్డు!