185Hz OLED డిస్‌ప్లే, లిక్విడ్ కూలింగ్‌తో పవర్‌ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!

Redmagic Astra 2

Redmagic Astra 2

REDMAGIC Astra 2: గేమింగ్ డివైస్‌ల తయారీలో పేరు పొందిన REDMAGIC తన తాజా ఫ్లాగ్‌షిప్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2ను గ్లోబల్ మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేసింది. గత నెలలో చైనాలో లాంచ్ చేసిన ఈ ట్యాబ్లెట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. మొబైల్ గేమింగ్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ డివైస్‌లో Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్, 185Hz OLED డిస్‌ప్లే, పరిశ్రమలో తొలిసారిగా ట్యాబ్లెట్‌లో అందించిన లిక్విడ్ కూలింగ్‌ సిస్టమ్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.

సూపర్ ఫాస్ట్ ప్రాసెసర్:

REDMAGIC Astra 2లో Qualcomm నుండి వచ్చిన కొత్త Snapdragon 8 Elite Gen 5 ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. దీనికి గరిష్టంగా 16GB RAM, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ అందించారు. భారీ గ్రాఫిక్స్ గేమ్స్, మల్టీటాస్కింగ్, హై-పర్ఫార్మెన్స్ యాప్స్‌ను సులభంగా నిర్వహించగలదు. ఇందులో REDMAGIC ప్రత్యేకంగా రూపొందించిన RedCore R4 గేమింగ్ చిప్ కూడా ఉంది. ఇది గేమింగ్ సమయంలో విజువల్ ఎఫెక్ట్స్, 2K సూపర్ రిజల్యూషన్, పవర్ మేనేజ్మెంట్ వంటి పనులను ప్రత్యేకంగా నిర్వహించి ప్రధాన ప్రాసెసర్‌పై భారం తగ్గిస్తుంది. అలాగే ఎనర్జీ క్యూబ్ 3.0 టెక్నాలజీ CPU, GPU, మెమరీ, టచ్, కూలింగ్ వంటి అన్ని విభాగాలను రియల్‌టైమ్‌లో ఆప్టిమైజ్ చేసి స్థిరమైన ఫ్రేమ్‌రేట్లను అందిస్తుంది.

2.4K OLED డిస్‌ప్లే:

ఈ గేమింగ్ ట్యాబ్లెట్‌లో 9.06 అంగుళాల 2.4K OLED డిస్‌ప్లేను అందించారు. ఇది 2400 × 1504 పిక్సెల్స్ రిజల్యూషన్, 185Hz రిఫ్రెష్ రేట్, 90.1% స్క్రీన్-టు-బాడీ రేషియో, కేవలం 4.9mm బెజెల్స్ తో వస్తుంది. అలాగే Synaptics S3930 టచ్ సిస్టం ద్వారా 300Hz టచ్ శాంప్లింగ్ రేట్, 2000Hz ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ సపోర్ట్ లభిస్తుంది. దీంతో గేమింగ్ సమయంలో టచ్ రెస్పాన్స్ అత్యంత వేగంగా ఉంటుంది.

ట్యాబ్లెట్‌లో తొలిసారి లిక్విడ్ కూలింగ్:

Astra 2లో AquaCore కూలింగ్ సిస్టం 2.0ను అందించారు. ఇది ట్యాబ్లెట్‌లో ఫ్లోయింగ్ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీని ఉపయోగించిన తొలి మోడల్‌గా కంపెనీ పేర్కొంది.
ఈ కూలింగ్ సిస్టమ్‌లో యాక్టివ్ లిక్విడ్ లూప్, లిక్విడ్ మెటల్ 3.0, 4D వేపర్ ఛాంబర్ వంటి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీలు ఉన్నాయి. దీని వల్ల ఎక్కువసేపు గేమింగ్ చేసినా ట్యాబ్లెట్ వేడెక్కకుండా స్థిరమైన పనితీరు అందిస్తుంది.

8300mAh బ్యాటరీ:

ఈ ట్యాబ్లెట్‌లో 8300mAh డ్యూయల్-సెల్ బ్యాటరీను అందించారు. ఇది 75W ఫాస్ట్ ఛార్జింగ్ కు మద్దతు ఇస్తుంది. కంపెనీ ప్రకారం, బ్యాటరీని సుమారు 60 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఇందులో రెండు USB Type-C పోర్టులు ఉన్నాయి. ఒకటి 75W ఫాస్ట్ ఛార్జింగ్‌కు, మరొకటి 40W ఛార్జింగ్, ఆడియో అవుట్‌పుట్‌కు అదనంగా 4K@144fps, 8K@60fps DisplayPort అవుట్‌పుట్, Bluetooth 6.0, Two-way Reverse Charging వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

ప్రీమియం డిజైన్:

REDMAGIC Astra 2లో మెటల్ ఫ్రేమ్, పారదర్శక గ్లాస్ బ్యాక్ ప్యానెల్‌తో పాటు లోపలి లిక్విడ్ కూలింగ్ భాగాలు కనిపించే ప్రత్యేక డిజైన్‌ను అందించారు. అలాగే RGB లైటింగ్ కూడా ఉంది. ఈ ట్యాబ్లెట్‌కు IP54 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణ లభిస్తుంది. ట్యాబ్లెట్‌లో DTS Ultra సపోర్ట్‌తో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, డ్యూయల్ X-axis లీనియర్ మోటార్లు ఉన్నాయి. Magic Key బటన్ ద్వారా GameSpaceను వెంటనే యాక్సెస్ చేయవచ్చు. ఇది REDMAGIC OS 11.5 (Android 16 ఆధారితం)పై పనిచేస్తుంది. ఇందులో 13MP రియర్ కెమెరా, 9MP ఫ్రంట్ కెమెరా, ఫేస్ అన్‌లాక్, ఫింగర్‌ప్రింట్ స్కానర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ధర:

REDMAGIC Astra 2 Gaming Tablet ఆగస్టు 10 నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో Early Bird Access ద్వారా అందుబాటులోకి రానుంది. ఆగస్టు 26 నుంచి ఓపెన్ సేల్ ప్రారంభమవుతుంది. Early Bird కస్టమర్లకు 80W ఫాస్ట్ ఛార్జర్తో పాటు ప్రత్యేక REDMAGIC Keychainను ఉచితంగా అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

* 12GB + 256GB వేరియంట్ ధర 749 డాలర్లు (రూ.72,085).
* 16GB + 512GB వేరియంట్ ధర 849 డాలర్లు (రూ.81,710).