Site icon NTV Telugu

Postman corruption: రెడ్డిగూడెంలో పోస్ట్ మెన్ రమేష్ చేతివాటం

Frauds

Frauds

ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెంలో ఘోరం జరిగింది. రెడ్డిగూడెంలో పోస్ట్ మేన్ రమేష్ చేతివాటం ప్రదర్శించాడు. ఆర్డీ ఖాతాదారుల పొదుపు సొమ్ము స్వాహా చేశాడు పోస్ట్ మేన్ రమేష్. ఖాతాదారుల నుండి ఒత్తిడి పెరగడంతో ఆత్మహత్యాయత్నం చేశాడు. పల్లెటూరు కావడంతో పోస్ట్ ఆఫీస్ లో తమ డబ్బు డిపాజిట్,విత్ డ్రా కోసం పోస్ట్ మేన్ పైనే ఆధారపడుతున్నారు ఖాతాదారులు. విత్ డ్రా డబ్బును స్వంత అవసరాలకు వాడుకుని పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు ఇంకా ఇవ్వలేదని నమ్మించే ప్రయత్నం చేశాడు పోస్ట్ మేన్ రమేష్. వత్తిడి పెరగడంతో 10రోజుల క్రితం పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

Read Also: Illicit Relationship: నచ్చజెప్పాడు.. వినలేదు.. తుపాకీతో కాల్చి చంపాడు

విషయం తెలియడంతో నిన్న పోస్ట్ ఆఫీస్ లో విచారణ‌ చేపట్టారు పోస్టల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ డి.శ్రీనివాసరావు. ఇప్పటి వరకూ సుమారు 4నుండి 5 లక్షల రూపాయలు స్వాహా జరిగినట్లు సమాచారం. బాధితులు బయటకు వస్తే ఈ మొత్తం పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఖాతాదారులు నమ్మినందుకు పోస్ట్ మెన్ తన నైజం ప్రదర్శించాడు. తమ డబ్బులు తమకు ఇప్పించాలని, రమేష్ పై చర్యలు తీసుకోవాలని బాధితులు పోస్టల్ శాఖ అధికారులను, పోలీసులను కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ కదా అని అక్కడ డబ్బులు దాచుకుంటే ఇలాంటి ఉద్యోగులు ఆ నమ్మకాన్ని వమ్ముచేస్తున్నారని ఖాతాదారులు వాపోతున్నారు.

Read Also: Cordon Search: విజయవాడ వైఎస్సార్ కాలనీలో కార్డన్ సెర్చ్

Exit mobile version