మనం అందరం వైట్ రైస్ ను ఎక్కువగా తీసుకుంటాం.. తెల్ల అన్నాని ఏ కూరతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. అయితే తెల్లబియ్యంతో వండిన అన్నంలో స్టార్చ్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి అంత మంచివి కాదు. కనుక తెల్ల అన్నాన్ని తక్కువగా తీసుకోవాలని నిపుణులు కూడా సూచిస్తున్నారు.. అయితే రైస్ లో వైట్ రైస్ తో పాటు ఎన్నో రకాల రైస్ లు ఉన్నాయి.. అందులో రెడ్ రైస్ కూడా ఒకటి.. ఈ రైస్ ను రోజూ తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని నిపుణులు అంటున్నారు.. ఎటువంటి ప్రయోజనాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రైస్ కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో దోహదపడుతుంది. అలాగే ఎర్ర బియ్యాన్ని తీసుకోవడం వల్ల రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. ఎర్రబియ్యంలో సెలీనియం, విటమిన్ సి, బీటాకెరోటీన్ వంటివి ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ నుండి శరీరాన్ని కాపాడడంలో సహాయపడతాయి.. ఇక ఎర్రబియ్యాన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. షుగర్ కారణంగా శరీర ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది. ఎర్రబియ్యంలో కొవ్వు, క్యాలరీలు తక్కువగా ఉంటాయి.
వీటితో వండిన అన్నాన్ని తీసుకోవడం వల్ల మనం బరువు పెరగకుండా ఉండవచ్చు. శరీరంలో కొవ్వు కూడా పేరుకుపోకుండా ఉంటుంది. వీటిలో ఎక్కువగా క్యాల్షియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి శరీర ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడంలో దోహదపడతాయి.. చర్మ సమస్యలను జుట్టు సమస్యల ను తగ్గిస్తుంది.. చర్మ సమస్యలను కూడా తగ్గిస్తుంది.. ఇంకా రెడ్ రైస్ ను రోజూ తీసుకుంటే బోలెడు ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.