NTV Telugu Site icon

Heatwave: ఠారెత్తిస్తున్న ఎండలు.. 7 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్

Heat

Heat

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం నుంచే భానుడు భగభగమండిపోతున్నాడు. ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఒకవైపు వేడి.. ఇంకోవైపు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఇక పిల్లలు, వృద్ధులు ఎండివేడిమికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పలు రాష్ట్రాల్లో భారీ స్థాయిల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో రాజధానిలో ప్రజలు హడలెత్తిపోతున్నారు. తాజా ఉష్ణోగ్రతల నేపథ్యంలో 7 రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

ఇది కూడా చదవండి: CM Revanth: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించాం..

రాజస్థాన్, పంజాబ్, హర్యానా, చండీఘర్, ఢిల్లీ, వెస్ట్ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో వచ్చే ఐదు రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ చేసింది. విదర్భ, ఈస్ట్ ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Shraddha Walkar case: శ్రద్ధావాకర్ మర్డర్ కేసులో మరిన్ని ఆధారాలతో మరో ఛార్జిషీట్..

విదర్భలో రాబోయే 5 రోజులు పొడి వాతావరణం ఉంటుందని.. మరి కొన్ని నగరాలు 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. విదర్భలో 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నాగ్‌పూర్‌లో 45.6 డిగ్రీల సెల్సియస్‌ను తాకింది. గత పదేళ్లలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే. అకోలా, అమరావతి, యావత్మాల్‌లో ఉష్ణోగ్రతలు దాదాపు 45 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి.

ఇది కూడా చదవండి: Maharagni : డైరెక్టర్ గా మారిన ప్రొడ్యూసర్.. పాన్ ఇండియన్ ‘మహా రాగ్ని టీజర్’!