NTV Telugu Site icon

Red Alert : తెలంగాణలో కొనసాగుతున్న వర్షం.. హైదరాబాద్ కు రెడ్ అలర్ట్

Alert Rain

Alert Rain

రాజధాని నగరం సహా తెలంగాణలోని అన్ని జిల్లాలను వరుణుడు ముంచేశాడు. మంగళవారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇవాళ ఉదయం కూడా పలు చోట్ల వాన పడుతోంది. ఒకవైపు జిల్లాల్లో తీవ్రస్థాయిలో పంట నష్టం జరగ్గా.. మరో వైపు హైదరాబాద్ కు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ ను భారీ వర్షం ముంచెత్తింది. భారీ ఈదురు గాలులతో దంచికొట్టడంతో.. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో గ్రేటర్ హైదరాబాద్ అప్రమత్తం అయ్యి నగరంలోకి దిగింది. అయినప్పటికీ పలు ప్రాంతాలు నీటిలోనే ఉండిపోయాయి.

Also Read : Wednes Day Bhakthi Tv Live: బుధవారం ఏ విఘ్నాలు లేకుండా ఉండాలంటే..

అయితే హైదరాబాద్ లో రామచంద్రాపురంలో అత్యధికంగా 6 సెంటిమీటర్ల వర్షం కురిసింది. శేరిలింగంపల్లి, బేగంపేట, కూకట్ పల్లి, గాజుల రామారం, మోహిదీపట్నం, మల్లేపల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్ తదితర ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదు అయింది. సికింద్రాబాద్, కాప్రా, మల్కాజ్ గిరి ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అకాల వర్షాలతో, వడగండ్ల వానతో తీవ్ర పంట నష్టం వాటిల్లుతోంది. మరో నాలుగు రోజుల పాటు వర్షా భావ పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వడగండ్ల వానలు పడొచ్చని చెబుతుంది. కాబట్టి.. ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం కోరుతుంది.

Also Read : Bhagmati boat: హుస్సేన్ సాగర్‌లో భాగమతి బోటుకు ఆటంకం.. 40 మంది పర్యాటకులు క్షేమం

మరో వైపు హైదరాబాద్ నగరంలో భారీగా వర్షం పడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. నగరంలోని పలు కాలనీలు నీట మునిగిపోయాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అవసరం అయితే తప్ప బయటకు రావొద్దంటూ హెచ్చరించారు. కంటిన్యూగా వర్షం కురుస్తుండటంతో ఉద్యోగాలు, డైలీ లెబర్, వ్యాపారులు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Show comments