NTV Telugu Site icon

Andhra Pradesh: ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇళ్ల స్థలాల లబ్ధిదారులపై పునర్విచారణ..

Ap Govt

Ap Govt

Andhra Pradesh: గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న కూటమి ప్రభుత్వం.. విచారణ తప్పదని హెచ్చరిస్తోన్న విషయం విదితమే.. అయితే, వైసీపీ హయాంలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా పేదలకు మంజూరు చేసిన ఇళ్ల పట్టాలు, హౌసింగ్ నిర్మాణాలకు అనుమతులు పొందిన లబ్ధిదారుల్లో అర్హులు, అనర్హులు విషయంలో లెక్కలు తేల్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇళ్ల స్థలాలు, పట్టాలు పొందిన లబ్ధిదారులపై పునర్విచారణ జరపాలని నిర్ణయం తీసుకుంది.. దీనికోసం ఈ నెల 10వ తేదీ నుంచి రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి లబ్ధిదారుల జాబితాలో అనర్హులుంటే వారిని గుర్తించాలని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి.. ఇక, ఈ సమాచారాన్ని నమోదు చేసేందుకు రెవెన్యూశాఖ ప్రత్యేక మొబైల్ యాప్ ను సిద్ధం చేసింది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పునర్విచారణ ప్రక్రియను ఆయా మండలాల్లో స్థానిక తహశీల్దార్ నేతృత్వంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్, సర్వేయరు, వీఆర్వో సభ్యులుగా ఉంటారు. క్షేత్రస్థాయిలో విచారణ చేసి.. ఈ నెల 15వ తేదీలోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలంటూ 26 జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు సీసీఎల్‌ఏ జయలక్ష్మి.. దీంతో, వైసీపీ.. తమ పార్టీ వారికి అక్రమంగా కట్టబెట్టిన వ్యవహారం బయటపడుతుందిన కూటమి నేతలు చెబుతున్నారు..

Read Also: Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌