NTV Telugu Site icon

China: పతనమవుతున్న చైనా ఆర్థిక వ్యవస్థ.. కారణాలు ఇవే

China

China

China Economy In Trouble: చాలా కాలం పాటు చైనాలో వృద్ధి పరుగులు పెట్టింది. రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా ఎదిగింది. అయితే గత కొంతకాలంగా చైనా ఆర్థిక పరిస్థితి దిగజారుతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. హాంగ్ కాంగ్ కు చెందిన హాంగ్ షెంగ్ ఇండెక్స్ భారీగా పతనమైంది. జనవరిలోని గరిష్ఠస్థాయితో 20 శాతం మేర పడిపోయింది. ఇక చైనీస్ కరెన్సీ యువాన్ కూడా పదహారేళ్ల కనిష్టానికి పడిపోయింది.

చైనా పరిస్థితి కరోనా తరువాత రోజురోజుకు దిగజారీ పోతుంది. వృద్ధి నిలిచిపోయింది. దీంతో ధరలు ఒక్కసారిగి పెరిపోయాయి. ఎగుమతులు భారీగా తగ్గాయి. వివిధ మేజర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులు చైనా ఆర్థిక వృద్ధి రేటును 5 శాతం కంటే దిగువకు అంచనా వేయడం గమనార్హం.నోమురా, మోర్గాన్ స్టాన్లీ, బార్క్‌లేస్ వంటి దిగ్గజాలు కూడా గతంలో కంటే ఇప్పుడు అంచనాలను తగ్గించాయి.

Also Read: Shridhar Babu: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉద్యోగ కల్పనలో విఫలం

చైనా ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యల్లో రియాల్టీ కష్టాలు కూడా ఒకటి. కరోనా లాక్ డౌన్ ఎత్తివేత తర్వాత రియల్ ఎస్టేట్ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లింది. ఇక్కడి మేజర్ హోమ్ బిల్డర్, ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ తమ పెట్టుబడిదారులకు చెల్లింపులు కూడా చేయలేనంతగా ఇబ్బందుల్లోకి వెళ్లాయి. ఇక చైనాలో అతిపెద్ద డెవలపర్ అయిన కంట్రీ గార్డెన్, మరో అతిపెద్ద కంపెనీ జోంగ్ రాంగ్ ట్రస్ట్ డిఫాల్ట్‌గా మారాయి. ఈ ప్రభావం చైనా ఆర్థిక వ్యవస్థపై భారీగా పడింది. దీంతో ఏప్రిల్ నుండి చైనా ఆర్థిక పరిస్థితి దిగజారుతూ వస్తుంది. వీటిని ఆదుకోవడానికి ప్రభుత్వం ప్యాకేజీని ప్రకటించినప్పటికీ అప్పటికే ఇవి డిఫాల్ట్ అంచున నిలిచాయి. డొమెస్టిక్ ఫండ్స్ ఎక్కువగా ప్రభుత్వ బాండ్లు, బ్యాంకు డిపాజిట్ వంటి సురక్షిత పెట్టుబడుల వైపు మరలుతుండటంతో నాన్-బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు లిక్విడిటీ సమస్యను ఎదుర్కొంటున్నాయి.

ఇక కరోనా తరువాత ప్రభుత్వాలకు రాబడి తగ్గి ఖర్చు పెరిగింది. ఇది కూడా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. అదేవిధంగా దేశంలో నిరుద్యోగ రేటు కూడా భారీగా పెరుగుతుంది. దాంతో చైనాలో జనాభా రేటు తగ్గుతుంది. వృద్ధుల సంఖ్య ఎక్కువగా పెరుగుతుంది. దీంతో ఆరోగ్య అవసరాల కోసం ప్రభుత్వం ఎక్కువగా ఖర్చు చేయాల్సి రావడం కూడా భారంగా మారుతోంది. వృద్ధాప్య సమాజం ఆర్థిక వృద్ధి సామర్థ్యానికి పెను సవాలుగా మారిందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ తన పరిశోధనా పత్రంలో పేర్కొంది. ఇక తొలిసారి చైనా జనాభా వృద్ధి రేటు జపాన్ కంటే తగ్గింది. ఈ అన్నీ కారణాలతో చైనా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది. మిగిలిన  దేశాలు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే దీని ప్రభావం వాటిపై పడే అవకాశం ఉంటుంది.