Realme Power Days Sale: స్మార్ట్‌ఫోన్ కొనాలని అనుకుంటున్న వినియోగదారులకు ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్ మీ (Realme) శుభవార్త తీసుకవచ్చింది. తాజాగా భారత్‌లో రియల్మీ పవర్ డేస్ సేల్ (Realme Power Days Sale)ను ప్రకటించింది. ఈ సేల్‌లో ఎంపిక చేసిన P-సిరీస్ స్మార్ట్ఫోన్లపై ప్రత్యేక డిస్కౌంట్లు, కూపన్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ ప్రయోజనాలను అందిస్తోంది. జూలై 21 నుంచి జూలై 24 వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.
Realme P4 Power 5Gపై తగ్గింపు:
Realme P4 Power 5Gలో భారీ 10,001mAh బ్యాటరీ, MediaTek Dimensity 7400 Ultra 5G ప్రాసెసర్, HyperVision+ AI చిప్ ఉన్నాయి. అలాగే Pearl Academyతో కలిసి రూపొందించిన ప్రత్యేక TransView Design ఈ ఫోన్‌కు ఆకర్షణగా నిలుస్తోంది. ఈ ఫోన్‌పై రూ.2,000 కూపన్ డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా 9 నెలల వరకు నో-కాస్ట్ EMI సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.
ధరలు (ఆఫర్ తర్వాత):
* 8GB + 128GB – రూ.29,999 నుంచి రూ.27,999.
* 8GB + 256GB – రూ.31,999 నుంచి రూ.29,999.
* 12GB + 256GB – రూ.34,999 నుంచి రూ.32,999.
Realme P4 Pro 5Gపై తగ్గింపు:
Realme P4 Pro 5Gలో Snapdragon 7 Gen 4 చిప్సెట్, హైపర్ విజన్ AI చిప్, 144Hz HyperGlow AMOLED 4D కర్వ్డ్ డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ఈ మోడల్‌పై రూ.2,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే 6 నెలల వరకు నో-కాస్ట్ EMI ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.
ధరలు (ఆఫర్ తర్వాత):
* 8GB + 128GB – రూ.28,999 నుంచి రూ.26,999.
* 8GB + 256GB – రూ.30,999 నుంచి రూ.28,999.
* 12GB + 256GB – రూ.32,999 నుంచి రూ.30,999.
realme P4R 5G ఆఫర్:
బడ్జెట్ సెగ్మెంట్లో వచ్చిన realme P4R 5Gలో 8,000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్, 144Hz డిస్ప్లే, NEXT AI ఫీచర్లు, Google Gemini ఇంటిగ్రేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ మోడల్‌పై ధర తగ్గింపు లేకపోయినా.. 3 నెలల వరకు నో-కాస్ట్ EMI సదుపాయం అందిస్తున్నారు.
ధరలు (ఆఫర్ తర్వాత):
* 4GB + 128GB – రూ.18,999.
* 6GB + 128GB – రూ.20,999.
* 6GB + 256GB – రూ.22,999.
ఎప్పుడు? ఎక్కడ కొనుగోలు.?
realme Power Days Sale జూలై 21 నుంచి 24 వరకు కొనసాగుతుంది. ఈ ఆఫర్లు realme అధికారిక వెబ్సైట్ తోపాటు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటాయి.

