రియల్‌మీ తమ బడ్జెట్ P సిరీస్‌లో మరో ఆకర్షణీయ మోడల్‌ను తీసుకొస్తోంది. Realme P4 Lite 5G భారత మార్కెట్‌లో త్వరలో లాంచ్ అవుతున్నట్లు కంపెనీ టీజ్ చేసింది. ఇది ఇటీవల లాంచ్ అయిన Realme P4 Lite (4G వెర్షన్)కు 5G వేరియంట్‌గా రాబోతోంది. ఫిబ్రవరి 2026లో 4G మోడల్ లాంచ్ అయిన తర్వాత, ఇప్పుడు 5G వెర్షన్ కోసం ఫ్లిప్‌కార్ట్‌లో డెడికేటెడ్ మైక్రోసైట్ లైవ్ అయింది. “A New Pioneer Awaits!” అనే ట్యాగ్‌లైన్‌తో డిజైన్ టీజ్ చేశారు. భారతదేశంలో త్వరలో (మార్చి 2026లో ) లాంచ్ అవుతుందని అంచనా. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో సేల్ అందుబాటులో ఉంటుంది. ప్రీ-ఆర్డర్లు త్వరలో స్టార్ట్ అవుతాయి.
Also Read:Farooq Abdullah: మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాపై కాల్పులు..
స్టార్టింగ్ ప్రైస్ రూ. 9,999 నుంచి రూ.11,999 వరకు (4GB+64GB, 4GB/6GB+128GB వేరియంట్లు). బడ్జెట్ సెగ్మెంట్‌లో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్‌గా రాబోతోంది. డిస్‌ప్లే.. 6.74 ఇంచ్ HD+ IPS LCD, 90Hz రిఫ్రెష్ రేట్, ఐ కంఫర్ట్ ఫీచర్స్‌తో స్మూత్ వ్యూయింగ్. ప్రాసెసర్.. Octa-core chipset (Unisoc T7250 లేదా సమానమైన 5G సపోర్ట్ చిప్‌సెట్). 4GB/6GB RAM + 64GB/128GB స్టోరేజ్ (డైనమిక్ RAM ఎక్స్‌పాన్షన్ సపోర్ట్). రియర్‌లో 13MP ప్రైమరీ (ట్రిపుల్ కెమెరా సెటప్, ఫ్లోటింగ్ లెన్స్ డిజైన్), ఫ్రంట్‌లో 5MP సెల్ఫీ.
6300mAh మాసివ్ బ్యాటరీ, 15W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ (1 ఛార్జ్‌తో 2 రోజుల వరకు యూసేజ్). 7.94mm అల్ట్రా-స్లిమ్ బాడీ, ఎలిగెంట్ పల్స్ లైట్ బ్యాక్ డిజైన్, IP54 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్. ఆండ్రాయిడ్ 15/16 బేస్డ్ realme UI, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, డ్యూయల్ సిమ్ 5G సపోర్ట్. Sea Blue, Obsidian Black, Beach Gold వంటి ఆకర్షణీయ కలర్స్ లో అందుబాటులో ఉండనుంది.
