Realme NARZO 80 Pro 5G: 6.77 అంగుళాల ఆమోల్డ్ డిస్ప్లే, 50MP కెమెరా, IP69 రేటింగ్ తో వచ్చేసిన రియల్‌మీ నార్జో 80 ప్రో
- కొత్త Narzo 80 సిరీస్ ఫోన్లను భారత మార్కెట్‌లో నేడు అధికారికంగా విడుదల
- Narzo 80 Pro 5G, Narzo 80x 5G అనే రెండు వేరియంట్లు లాంచ్
- 6.77 అంగుళాల ఆమోల్డ్ డిస్ప్లే, 50MP కెమెరా, IP69 రేటింగ్
- MediaTek Dimensity 7400 SoC ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15 ఆధారంగా Realme UI 6తో పని
- 50MP ప్రధాన కెమెరా (OIS), 2MP సెకండరీ కెమెరా, ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా
- 6000mAh బ్యాటరీ, 80W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్, 65W రివర్స్ చార్జింగ్ సపోర్ట్
- 8GB + 128GB వేరియంట్ ధర రూ.13,999
- 8GB + 256GB వేరియంట్ ధర రూ.21,499 రియల్‌మీ NARZO 80 Pro 5G సొంతం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Realme NARZO 80 Pro 5G: రియల్‌మీ కంపెనీ తన కొత్త Narzo 80 సిరీస్ ఫోన్లను భారత మార్కెట్‌లో నేడు (ఏప్రిల్ 9)న అధికారికంగా విడుదల చేసింది. ఈ సిరీస్‌లో Narzo 80 Pro 5G, Narzo 80x 5G అనే రెండు వేరియంట్లు ఉన్నాయి. అధునాతన ఫీచర్లతో, శక్తివంతమైన ప్రాసెసర్లతో, భారీ బ్యాటరీలతో ఈ ఫోన్లు మిడ్ రేంజ్ వినియోగదారులకే లక్ష్యంగా రూపొందించబడ్డాయి. ఈ రెండు ఫోన్లు అమెజాన్, రియల్‌మీ ఇండియా వెబ్‌సైట్ ద్వారా అమ్మకాలు జరుగుతాయి. ఏప్రిల్ 9న సాయంత్రం 6 గంటల నుండి అర్ధరాత్రి వరకు Narzo 80 Pro 5G పై Early Bird Sale ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఏప్రిల్ 11న Narzo 80x 5G కూడా అమ్మకానికి అందుబాటులోకి వస్తుంది. ఈ సేల్ లో రూ. 2,000 వరకు డిస్కౌంట్, అలాగే విద్యార్థులకు ప్రత్యేకంగా రూ.1,299 విలువ గల ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.
Read Also: Murder : ములుగు జిల్లాలో దారుణం.. గొడ్డలితో నరికి గిరిజన యువకుడిని హత్య
Also Read
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
ఇక రియల్‌మీ Narzo 80 Pro 5G ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 6.77 అంగుళాల Full HD+ కర్వ్డ్ ఆమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 800 నైట్స్ బ్రైట్‌నెస్ డిస్‌ప్లే లభిస్తుంది. ఇక ఇందులో MediaTek Dimensity 7400 SoC ప్రాసెసర్ అందించారు. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా Realme UI 6తో పని చేస్తుంది. ఇక మొబైల్ లోని కెమెరా విషయానికి వస్తే ఇందులో వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరా (OIS), 2MP సెకండరీ కెమెరా, ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా (EIS సపోర్ట్) లభిస్తాయి.
ఇక ఈ మొబైల్ లో 6000mAh బ్యాటరీ, 80W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్, 65W రివర్స్ చార్జింగ్ సపోర్ట్ ను అందించనున్నారు. అలాగే IP69 రేటింగ్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ కూడా అందుబాటులో ఉంది. అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, USB టైప్-C పోర్ట్ లభిస్తాయి. ఈ ఫోన్‌లు నిట్రో ఆరంజ్, రేసింగ్ గ్రీన్, స్పీడ్ సిల్వర్ రంగులలో లభ్యమవుతాయి. ఇక ఈ మొబైల్ ధర విషయానికి వస్తే.. 8GB + 128GB వేరియంట్ ధర రూ.13,999, 8GB + 256GB వేరియంట్ ధర రూ.21,499గా నిర్ణయించారు.
తాజావార్తలు
-
MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
-
NBK 112 : బాలయ్య సినిమాలో విలన్ గా యాంగ్రీ యంగ్ సీనియర్ హీరో?
-
Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
-
Shreyas Iyer: కేక్‌పై ఐసింగ్ లాంటిది.. టీమిండియా కెప్టెన్సీపై తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్!
-
Sriram Krishnan: ట్రంప్ ప్రభుత్వానికి షాక్.. AI విధాన సలహాదారు పదవికి శ్రీరామ్ కృష్ణన్ రాజీనామా
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!