ప్రస్తుతం టెక్నాలజీ మారుతున్న కొద్దీ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రకాల ఆవిష్కరణలు రూపొందుకుంటున్నాయి. ఇందులో భాగంగానే ప్రపంచ మార్కెట్లోకి ప్రతిరోజు ఏదో ఒక కొత్త సరుకు వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా మొబైల్ ఫోన్స్, లాప్టాప్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని ఉపయోగించుకుని మార్కెట్లోకి వస్తుంటాయి. ఇకపోతే ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్ మీ నుండి ఏప్రిల్ 24 న భారతీయ మార్కెట్లో కొత్త ఫోన్ లాంచ్ కాబోతోంది. ఈ ఫోన్ సంబంధించి వివరాలను చూస్తే..
Also read: Israel Attack: ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీలు సేఫ్.. దేశవ్యాప్తంగా విమానాల నిలిపివేత..
Realme Narzo 70x 5G పేరుతో వస్తోన్న ఈ ఫోన్ ఏప్రిల్ 24న తేదీన భారతీయ మార్కెట్ లో లాంచ్ కాబోతుంది. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ ద్వారా ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. ఇక ఈ ఫోన్ సంబంధించి వివరాలు చూస్తే.. డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీని పొందుపరిచారు. ఈ ఫోన్ 45 వాట్ సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. 25 నిమిషాల్లో 0 నుంచి 50 శాతం చార్జ్ అవుతుందని కంపెనీ తెలుపుతుంది. ఇక ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో ఏఐ సెన్సర్స్ ఉంటాయో ఇంకా తెలియదు. ఇక ఇందులోని డ్యూయల్ కెమెరాలు సర్క్యులర్ మాడ్యూల్ లో ఉంటాయని తెలుస్తోంది.
Also read: Theppa Samudram Review: బిగ్ బాస్ అర్జున్ ‘తెప్ప సముద్రం’ మూవీ రివ్యూ
ఈ ఫోన్ సంబంధించి భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. అలాగే 120 hz ఫ్లాట్ అమోలెడ్ స్క్రీన్, పంచ్ హోల్ కటౌట్ ఉంటాయి. ఇక ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.12,000 లోపు ఉంటుందని తెలుస్తోంది. కాకపోతే కచ్చితమైన ధర వివరాలు లాంచ్ తేదీ రోజున వెలుబడుతాయి. ఈ ఫోన్ డివైజ్ 4జిబి/6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లలో లభిస్తుంది.
