NTV Telugu Site icon

Realme Narzo 60 Series Launch: రియల్‌మీ నార్జో 60 సిరీస్ లాంచ్.. డిస్కౌంట్ ఆఫర్స్ ఇవే!

Realme Narzo 60

Realme Narzo 60

Realme Narzo 60 Series Launch in India on July 6th: చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘రియల్‌మీ’ కొన్ని రోజుల క్రితం భారతదేశంలో 11 సిరీస్‌ను ప్రారంభించింది. ఇప్పుడు దేశంలో రియల్‌మీ నార్జో (Realme Narzo 60 Series) సిరీస్‌ను పరిచయం చేస్తుంది. ఈ వారం చివరిలో 60 సిరీస్ ఫోన్ దేశీయ మార్కెట్లోకి రానుంది. రియల్‌మీ నార్జో60 5జీతో పాటు రియల్‌మీ నార్జో 60 ప్రో 5జీ ఫోన్ కూడా లాంచ్ కానుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు జులై 6 మధ్యాహ్నం 12 గంటలకు దేశీయ మార్కెట్లో రిలీజ్ కానున్నాయి.

Realme Narzo 60 Pre-Booking:
వచ్చేవారం నుంచి రియల్‌మీ నార్జో60 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల ప్రీ-ఆర్డర్లు ప్రారంభం కానున్నాయి. ఈ కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ ద్వారా ప్రీ-ఆర్డర్స్ బుక్ చేసుకోవచు. జూలై 6 మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రీ-ఆర్డర్లు బుక్ చేసుకోవచ్చు. ప్రీ-ఆర్డర్స్ బుక్ చేసుకున్న కస్టమర్లకు డిస్కౌంట్లు ఆఫర్లు ఉన్నాయి. రియల్‌మీ నార్జో60 5జీ ఫోన్‌పై రూ.1,500 డిస్కౌంట్, వెనీలా రియల్‌మీ నార్జో60 5జీ ఫోన్ పై రూ.1000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ రెండు మోడల్ స్మార్ట్‌ఫోన్‌లపై ఆరు నెలల వారంటీ ఉంది.

Realme Narzo 60 Features:
రియల్‌మీ నార్జో 60 సిరీస్‌లో రెండు స్మార్ట్‌ఫోన్‌లు (రియల్‌మీ నార్జో 60 మరియు రియల్‌మీ నార్జో 60 ప్రో) ఉన్నాయి. నార్జో 60 ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్‌సెట్ వస్తుంది. అయితే నార్జో 60 ప్రోలో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 SoC అందించబడుతుంది. ఈ రెండు ఫోన్‌లు ఆండ్రాయిడ్ 13 ఆధారంగా రియల్‌మీ యూఐ 4.0తో వస్తాయి. వనిల్లా మోడల్‌లో 2400 x 1080 పిక్సెల్‌ (FHD+) రిజల్యూషన్‌తో 6.43-అంగుళాల ఫ్లాట్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్ మరియు ఎగువ ఎడమ మూలలో పంచ్ హోల్‌ను కలిగి ఉంటుంది. ప్రో వెర్షన్ 2412 x 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల 10-ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

Also Read: MS Dhoni Security Guard: ఎంఎస్ ధోనీ మంచి మనసు.. నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో!

Realme Narzo 60 Camera:
వెనిలా మోడల్‌లో 64MP బ్యాక్ కెమెరా మరియు 8MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ప్రో వేరియంట్ 100MP బ్యాక్ కెమెరా మరియు 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. ఈ రెండింటిలోనూ 2MP డెప్త్ సెన్సార్ ఉంటుంది. రెండు స్మార్ట్‌ఫోన్‌లలో అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ ఉంటుంది. ప్రో మోడల్ మాత్రమే డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంటుంది.

Realme Narzo 60 Battery:
వెనిలా మోడల్‌ 33W ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తే.. ప్రో మోడల్‌ 67W ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. రెండు స్మార్ట్‌ఫోన్‌లు 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటాయి. ప్రో 12GB RAM మరియు 1TB మెమరీ కాన్ఫిగరేషన్‌తో భారతదేశంలో రిలీజ్ అవుతుంది. దాంతో వినియోగదారులు తమ డేటా, ఫైల్స్, ఫోటోలు మరియు వీడియోలను సులభంగా సేవ్ చేసుకోవచ్చు.

Realme Narzo 60 Price:
భారతదేశంలో రియల్‌మీ నార్జో 60 స్మార్ట్‌ఫోన్‌ ధర దాదాపుగా రూ. 20,000 ఉండవచ్చని అంచనా. రియల్‌మీ నార్జో 60 ప్రో స్మార్ట్‌ఫోన్‌ ధర రూ. 25,000 కంటే తక్కువగా ఉండవచ్చని అంచనా.

Also Read: SL vs NZ: శ్రీలంక చారిత్రక విజయం.. తొలి సిరీస్‌ సొంతం!