NTV Telugu Site icon

Realme GT 7 Pro: ‘రియల్‌మీ జీటీ 7 ప్రో’ ప్రీ-బుకింగ్ మొదలు.. ఆఫర్లు ఇవే!

Realme Gt 7 Pro Launch

Realme Gt 7 Pro Launch

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘రియల్‌మీ’ తన జీటీ సిరీస్‌లో ‘జీటీ 7 ప్రో’ను రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే చైనాలో విడుదల అయిన రియల్‌మీ జీటీ 7 ప్రో.. నవంబర్ 26న భారతదేశంలో లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్‌లు ప్రారంభమయ్యాయి. నవంబర్ 18 నుంచే ప్రీ-బుకింగ్ మొదలైంది. ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’లో జీటీ 7 ప్రో అమ్మకాలు అందుబాటులో ఉంటాయి.

రియల్‌మీ జీటీ 7 ప్రో స్మార్ట్‌ఫోన్ ప్రీ-బుకింగ్‌లు సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్‌లో ప్రారంభమయ్యాయి. కస్టమర్‌లు రూ.1,000 చెల్లించి ప్రీ-బుకింగ్ చేయవచ్చు. అదే సమయంలో ఆఫ్‌లైన్ ఛానెల్‌లో కూడా ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో ముందస్తుగా బుక్ చేసుకోవాలనుకునే వారు రూ.2,000 చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ నుండి ప్రీ-బుకింగ్ చేసుకున్న వారికి రూ.3,000 బ్యాంక్ ఆఫర్‌ వర్తిస్తుంది. 12 నెలల నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. అంతేకాదు ఒక సంవత్సరం పాటు స్క్రీన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్‌ను కూడా అందిస్తోంది.

Also Read: Tilak Varma Captain: కెప్టెన్‌గా తిలక్ వర్మ.. టీమ్ ఫుల్ డీటెయిల్స్ ఇవే!

రియల్‌మీ జీటీ 7 ప్రో ఫోన్‌ 6.78 ఇంచెస్ 2కే ఎకో2 స్కై డిస్‌ప్లేతో వస్తోంది. ఇది 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 2600 హెడ్జ్ ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్, 6000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 ఎలైట్‌తో వస్తోన్న ఈ ఫోన్.. రియల్‌మీ యూఐ 6.0 జీరో ఆండ్రాయిడ్ 14పై రన్ అవుతుంది. ఇందులో 50ఎంపీ సోనీ IMX906 ప్రైమరీ సెన్సార్, 8ఎంపీ వైడ్ యాంగిల్ లెన్స్, 3ఎఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50ఎంపీ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16 ఎంపీ కెమెరా ఉంటుంది. ఇక 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఉంది.

Show comments