NTV Telugu Site icon

Realme GT 7 Pro Launch: ‘రియల్‌మీ జీటీ 7 ప్రో’ వచ్చేసింది.. సూపర్ కెమెరా, జంబో బ్యాటరీ!

Realme Gt 7 Pro Launch

Realme Gt 7 Pro Launch

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ‘రియల్‌మీ’.. తన జీటీ సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ‘రియల్‌మీ జీటీ 7 ప్రో’ను చైనాలో విడుదల చేసింది. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 ఎలైట్‌తో వస్తున్న ఫస్ట్ ఫోన్ ఇదే. ఇందులో ఇందులో జంబో బ్యాటరీ, సూపర్ కెమెరాను అందించింది. దుమ్ము, నీరు చేరకుండా ఐపీ68 రేటింగ్‌ను ఇచ్చారు. ఈ ఫోన్ నవంబర్ 26న భారతదేశంలో లాంచ్ కానుంది. జీటీ 7 ప్రో ఫోన్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో చూద్దాం.

రియల్‌మీ జీటీ 7 ప్రో 12జీబీ+256జీబీ వేరియంట్ ధర 3599 యువాన్ (భారత కరెన్సీలో దాదాపుగా రూ.42,559)గా ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ 16జీబీ+1టీబీ ధర 4799 యువాన్లకు (సుమారు రూ.56,776)గా ఉంది. 16జీబీ+256జీబీ, 12జీబీ+512జీబీ, 16GB+512జీబీ వేరియంట్‌లలో కూడా ఈ ఫోన్ అందుబాటులో ఉంది. చైనాలో స్టార్ ట్రైల్ టైటానియం, లైట్ డొమైన్ వైట్, మార్స్ ఎక్స్‌ప్లోరేషన్ కలర్ ఆప్షన్‌లలో రిలీజ్ అయింది.

Also Read: Sanju Samson: ఆ ముగ్గురు ప్లేయర్స్.. నా కొడుకు పదేళ్ల కెరీర్‌ను నాశనం చేశారు: శాంసన్ తండ్రి

రియల్‌మీ జీటీ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 6.78 ఇంచెస్ 2కే ఎకో2 స్కై డిస్‌ప్లేతో వస్తోంది. ఇది 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 2600 హెడ్జ్ ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్, 6000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌కు మద్దతు ఇస్తుంది. ఇది క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 ఎలైట్‌తో వస్తోంది. రియల్‌మీ యూఐ 6.0 జీరో ఆండ్రాయిడ్ 14పై రన్ అవుతుంది. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది. 50ఎంపీ సోనీ IMX906 ప్రైమరీ సెన్సార్, 8ఎంపీ వైడ్ యాంగిల్ లెన్స్, 3ఎఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50ఎంపీ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉంటుంది. సెల్ఫీల కోసం 16 ఎంపీ కెమెరా ఉంటుంది. 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు.