ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ‘రియల్‌మీ’ తన జీటీ సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్దమైంది. రియల్‌మీ జీటీ 7 ప్రో నవంబర్‌లో చైనా సహా భారతదేశంలో రిలీజ్ కానుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ఎలైట్‌తో వస్తున్న ఫస్ట్ ఫోన్ ఇదే అని చెప్పాలి. కంపెనీ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌తో ఇది రానుంది. జీటీ 7 ప్రో పిక్స్ ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. లాంచ్‌కు ముందు ఆన్‌లైన్‌లో లీక్ అయిన ఫీచర్స్ ఏంటో ఓసారి తెలుసుకుందాం.
లీక్‌ల ప్రకారం రియల్‌మీ జీటీ 7 ప్రో 6.78 ఇంచెస్ ఓఎల్‌ఈడీ ప్లస్ డిస్‌ప్లేతో రానుంది. 2780 x 1264 పిక్సెల్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేటు, 6000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. డిస్‌ప్లే డాల్బీ విజన్‌కి 100 శాతం డీసీఐ-పీ3 కలర్ సపోర్ట్ అందిస్తుంది. అడ్రినో 830 జీపీయూ ద్వారా టాప్-టైర్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది.రియల్‌మీ యూఐ 6.0తో ఆండ్రాయిడ్ 15 ఓఎస్‌తో రన్ అవుతుంది. 12జీబీ, 16జీబీ/24జీబీ ర్యామ్ ఆప్షన్లలో రానుంది.
Also Read: Glenn Maxwell: అస్సలు ఆడలేం.. అత్యంత కఠినమైన బౌలర్ అతడే!
రియల్‌మీ జీటీ 7 ప్రోలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్)తో కూడిన 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ సామర్థ్యాలతో 50 ఎంపీ టెలిఫోటో కెమెరా ఉండే అవకాశాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం 16 ఎంపీ కెమెరా ఉంటుంది. ఇన్-డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6500 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీతో రానుంది. రియల్‌మీ జీటీ6 8జీబీ+256 జీబీ వేరియంట్ ధర రూ.40,999తో కంపెనీ లాంచ్ చేసింది. జీటీ 7 ప్రో ధర ఇంకా ఎక్కువగానే ఉండనుంది.