Realme 17 Ultra: రియల్మీ మరో సరికొత్త ఫోన్ Realme 17 Ultra పేరుతో రాబోతుంది. తాజాగా ఈ ఫోన్‌కు సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. ముఖ్యంగా ఇందులో ప్రత్యేకమైన యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్, భారీ బ్యాటరీ, హై రిఫ్రెష్ రేట్ డిస్ప్లే వంటి ఫీచర్లు ఉండబోతున్నాయి. ఈ ఫోన్ గేమింగ్ ప్రియులను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
లీక్ వివరాల ప్రకారం.. ఇందులో 6.78 అంగుళాల ఫ్లాట్ OLED డిస్ప్లే ఉండనుంది. ఇది 1.5K రిజల్యూషన్, 185Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేయనుంది. మెరుగైన మన్నిక కోసం మెటల్ ఫ్రేమ్‌ను కూడా అందించనున్నట్లు సమాచారం. అధిక రిఫ్రెష్ రేట్ కారణంగా గేమింగ్, వీడియోలు చూడటం, ఫోన్ వినియోగంలో మరింత స్మూత్ అనుభూతి లభించే అవకాశం ఉంది. ఈ ఫోన్లో అందరినీ ఆకర్షించే ప్రత్యేక ఫీచర్ పిన్-టైప్ యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్. సాధారణంగా గేమింగ్ స్మార్ట్ఫోన్లలో కనిపించే ఈ టెక్నాలజీని రియల్మీ తన నంబర్డ్ సిరీస్‌లోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫ్యాన్‌కు RGB లైటింగ్ ఎఫెక్ట్స్ కూడా ఉండనున్నాయని లీక్ పేర్కొంది.
పనితీరు విషయానికి వస్తే.. Realme 17 Ultraలో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 5 చిప్‌సెట్‌ను ఉపయోగించనున్నట్లు సమాచారం. ఈ ప్రాసెసర్‌తో భారీ గేమ్స్, మల్టీటాస్కింగ్ వంటి పనులను సులభంగా నిర్వహించవచ్చు. కెమెరాల పరంగా కూడా ఈ ఫోన్ ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఇందులో 1/1.56 అంగుళాల సెన్సార్ సైజుతో కూడిన 200MP శాంసంగ్ HP5 మెయిన్ కెమెరా ఉండనుంది. దీనికి జోడీగా 3.5x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేసే 50MP JN5 పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను అందించనున్నట్లు సమాచారం. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 50MP కెమెరా ఉండనుంది.
బ్యాటరీ విషయంలో రియల్మీ భారీ మార్పు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్లో ఏకంగా 9,000mAh బ్యాటరీని అందించనున్నట్లు లీక్ వెల్లడించింది. దీనికి 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండనుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. Realme 17 Ultra చైనా మార్కెట్లో విడుదల కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలో మాత్రమే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్లు, లాంచ్ వివరాలను రియల్మీ అధికారికంగా ప్రకటించలేదు. కంపెనీ నుంచి అధికారిక ప్రకటన వస్తేనే పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

