Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Realme 17 PRO: రియల్మీ (Realme) తన నంబర్డ్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను తిరిగి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే Realme 17T 5G ఫోన్‌కు సంబంధించిన వివరాలు బయటకు రాగా.. తాజాగా Realme 17 Pro స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. ఈ ఫోన్ 10,000mAh బ్యాటరీ బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో రానున్నట్లు తెలుస్తోంది. లీక్‌ల ప్రకారం Realme 17 Proలో 1.5K రిజల్యూషన్‌తో కూడిన AMOLED డిస్ప్లే ఉండనుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేయనుంది. MediaTek Dimensity 7300 ప్రాసెసర్ అందించనున్నట్లు సమాచారం.
కెమెరా విషయానికి వస్తే.. వెనుకవైపు 50MP మెయిన్ కెమెరాతో పాటు 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉండనున్నట్లు టాక్. సెల్ఫీల కోసం 32MP లేదా 50MP ఫ్రంట్ కెమెరాను అందించే అవకాశం ఉంది. అయితే ఫ్రంట్ కెమెరాతో 4K రిజల్యూషన్‌లో 30fps వీడియో రికార్డింగ్ చేయవచ్చని లీకైన వివరాలు సూచిస్తున్నాయి. ఇతర ఫీచర్ల విషయానికి వస్తే.. ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IP68/IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఉండనున్నాయి. సాఫ్ట్వేర్ పరంగా ఆండ్రాయిడ్ 17 ఆధారిత ColorOS 17తో ఈ ఫోన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇటీవల ఒప్పో, రియల్మీ సంస్థల మధ్య జరిగిన మార్పుల నేపథ్యంలో Realme UIకి బదులుగా ColorOS అందించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read
- Jio Diwali Offer: జియో దీపావళి ధమాకా.. ఒక్క మిస్డ్ కాల్‌తో 5 నెలలు ఫ్రీ వై-ఫై, ఓటీటీలు ఉచితం!
- అత్యంత చవకగా iPhone 18e .. ప్రో మోడల్స్ కంటే తక్కువ ధరకే ఎంట్రీ!
- Vivo Y6k: వివో Y6k 5G స్మార్ట్‌ఫోన్.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, IP65 రేటింగ్‌తో లాంచ్!
- Enough Phone: iPhone 13 Mini సైజులో కొత్త స్మార్ట్‌ఫోన్.. 50MP కెమెరా, రిమూవబుల్ బ్యాటరీతో Enough Phone లాంచ్!
ఇక ఈ సిరీస్‌లోని హైఎండ్ మోడల్ రియల్మీ 17 ప్రో+కు సంబంధించిన వివరాలు కూడా గతంలో లీక్ అయ్యాయి. ఈ ఫోన్లో 200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 1.5K ఫ్లాట్ OLED డిస్ప్లే ఉండనున్నట్లు సమాచారం. అంతేకాకుండా ‘ప్రో’ మోడల్‌తో పోలిస్తే ‘ప్రో+’లో మరింత శక్తివంతమైన ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది. అయితే ఈ ఫోన్ల ఫీచర్లు, విడుదల తేదీ, ధరపై రియల్మీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!
-
Sonia Gandhi: ‘ఇది పొలిటికల్ బుక్ కాదు’.. తన కొత్త పుస్తకం ‘Belonging’పై సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు
-
IPL 2027: టీమిండియా పవర్ హిట్టర్‌పై కన్ను.. గుజరాత్ టైటాన్స్‌ది పెద్ద ప్లానే!
-
Diwali Fire Accidents: దీపావళి వేళ హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు.. పలు ప్రాంతాల్లో భారీగా ఆస్తి నష్టం..!
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అత్యంత జాగ్రత్త.. మీరున్నారో చూసుకోండి!
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!