IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
- Realme 16T 5G భారత్‌లో అధికారికంగా లాంచ్
- “All-Star Battery. Superstar Portraits” ట్యాగ్‌లైన్‌తో మార్కెట్లోకి
- IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్ రేటింగ్
- Gleaming Wings Designతో స్టైలిష్ లుక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Realme 16T 5G Launched: రియల్మీ (Realme) నుండి భారత మార్కెట్లో రియల్మీ 16T 5G (Realme 16T 5G)ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ “All-Star Battery. Superstar Portraits” అనే ట్యాగ్‌లైన్‌తో మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఈ స్మార్ట్ ఫోన్ “Gleaming Wings Design” తో రూపొందించబడింది. వెనుక భాగంలో లైట్ పడినప్పుడు కలర్ షేడ్స్ మారుతూ కనిపించే ప్రత్యేక డిజైన్ ఈ ఫోన్‌కు స్టైలిష్ లుక్‌ను ఇస్తుంది.
ఈ ఫోన్‌కు IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ లభించింది. అంటే హై ప్రెషర్, హై టెంపరేచర్ వాటర్ జెట్స్ నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. అలాగే MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ టెస్టింగ్‌ను కూడా ఇది పాస్ చేసింది. అలాగే ఇందులో ఆర్మర్ షెల్ 4-లేయర్ డ్రాప్ ప్రొటెక్షన్ అందించారు. దీని వల్ల ఫోన్ పడిపోయినా నష్టాన్ని తగ్గించేలా డిజైన్ చేశారు.
Also Read
- ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
- 705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
- అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
- Kodak QLED Smart TV: కోడాక్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ రిలీజ్.. Google TV 5.0తో థియేటర్ ఫీల్!
realme 16T 5G లో 6.8 అంగుళాల HD+ IPS LCD సన్ లైట్ డిస్ప్లే ఇచ్చారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1200 నిట్స్ వరకు HBM బ్రైట్నెస్, DC Dimming Eye Care టెక్నాలజీ వంటి ఫీచర్లు కలిగి ఉంది. ఈ డిస్ప్లే సూర్యకాంతిలో కూడా క్లియర్ విజిబిలిటీని అందిస్తుంది. ఇంకా ఇందులో 6nm ఆధారిత MediaTek Dimensity 6300 SoC ప్రాసెసర్‌ను ఉపయోగించారు. గేమింగ్ సమయంలో హీట్ తగ్గించేందుకు 5300mm² AirFlow VC Cooling System అందించారు. దీని వల్ల స్టేబుల్ 60FPS గేమింగ్ అనుభవం లభిస్తుందని కంపెనీ చెబుతోంది.
కెమెరా విషయానికి వస్తే.. ఇందులో 50MP Sony IMX852 ప్రధాన కెమెరా ఉంది. దీనికి f/1.8 అపర్చర్ సపోర్ట్ ఉంటుంది. అలాగే 2MP మోనోక్రోమ్ సెన్సార్‌ను కూడా జోడించారు. ఫ్రంట్‌లో 16MP Sony IMX480 సెల్ఫీ కెమెరా ఉంది. వీటికి తోడు అనేక AI ఆధారిత ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇవి తక్కువ వెలుతురు పరిస్థితుల్లో కూడా మంచి ఫోటోలు రావడానికి ఈ ఫీచర్లు సహాయపడతాయి.

ఈ ఫోన్లో ప్రధాన హైలైట్ 8000mAh టైటాన్ బ్యాటరీ. రియల్మీ నంబర్ సిరీస్‌లో ఇప్పటివరకు వచ్చిన అతిపెద్ద బ్యాటరీ ఇదే. కంపెనీ ప్రకారం ఇది సాధారణ వినియోగంలో 3 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. ఈ బ్యాటరీ 45W ఫాస్ట్ ఛార్జింగ్, 48 నిమిషాల్లో 50% ఛార్జ్, 5 నిమిషాల ఛార్జ్‌తో 7% బ్యాటరీ, బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్, 7 సంవత్సరాల బ్యాటరీ హెల్త్ గ్యారంటీ, వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ కలిగి ఉంది. ఈ ఫోన్ అరోరా గ్రీన్, స్టార్ లైట్ బ్లాక్, స్టార్ లైట్ రెడ్ (భారత్‌కు ప్రత్యేక వేరియంట్) అనే మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ Android 16 ఆధారిత realme UI 7.0 పై పనిచేస్తుంది. AI Boost 3.0, Extended Use Care 2.0 వంటి ఫీచర్లతో దీర్ఘకాలం స్మూత్ పనితీరు అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
భారత మార్కెట్లో realme 16T 5G స్మార్ట్‌ఫోన్‌ను మూడు వేరియంట్లలో విడుదల చేశారు. ఇందులో 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999 కాగా, 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్‌ను రూ. 31,999కు అందిస్తున్నారు. ఇక టాప్ ఎండ్ 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 34,999గా ఉంది. బ్యాంక్ ఆఫర్లు, UPI డిస్కౌంట్లు, EMI సదుపాయాలతో ఈ ఫోన్‌ను మరింత తక్కువ ధరకు లభించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మే 27 నుంచి ఫ్లిప్‌కార్ట్, Realme.com, రిటైల్ స్టోర్లలో అమ్మకాలకు అందుబాటులోకి రానుంది.

తాజావార్తలు
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
VishnuPriya : ఏడ్చి ఏడ్చి విసిగిపోయా, ఇక నోరు మూసుకునేది లేదు: విష్ణుప్రియ ఫైర్!
-
Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్‌లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
-
RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
-
SRH Vs RCB: ఉప్పల్‌లో మ్యాచ్ ముగిసినా స్టేడియంలోనే ఉండండి.. కారణం ఏంటంటే..
ట్రెండింగ్
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!