చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘రియల్‌మీ’ ఇటీవలి కాలంలో వరుసగా స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తోంది. తాజాగా ‘రియల్‌మీ 14ఎక్స్’ పేరిట కొత్త మొబైల్‌ను మార్కెట్లోకి లాంచ్ చేసిన కంపెనీ.. రంగు మారే స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు సిద్దమైంది. ‘రియల్‌మీ 14 ప్రో’ సిరీస్ జనవరిలో విడుదల కానుంది. రియల్‌మీ ఇంకా అధికారిక లాంచ్ డేట్ ప్రకటించలేదు. ఈ సిరీస్‌లో రియల్‌మీ 14 ప్రో, రియల్‌మీ 14 ప్రో ప్లస్ రిలీజ్ కానున్నాయి.
అధునాతన టెక్నాలజీతో రియల్‌మీ 14 ప్రో సిరీస్ కంపెనీ విడుదల చేయనుంది. ఇవి ప్రత్యేకంగా రంగును మార్చే బ్యాక్ డిజైన్‌ను కలిగి ఉంటాయి. బ్యాక్ ప్యానెల్ థర్మోక్రోమిక్ పిగ్మెంట్‌లతో వస్తోంది. దాంతో ఉష్ణోగ్రతను బట్టి ఈ మొబైల్స్ వాటి రంగును మారుస్తాయి. ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉన్నప్పుడు.. ఈ మొబైల్స్ నీలం రంగులోకి మారుతాయి. ఉష్ణోగ్రత పెరిగేకొద్దీ మరలా యధావిధి రంగులోకి వస్తాయి. ప్రపంచంలోనే కోల్డ్ సెన్సిటివ్ కలర్ ఛేంజ్ టెక్నాలజీతో వస్తున్న మొదటి స్మార్ట్‌ఫోన్స్ ఇవే.
Also Read: Gold Rate Today: వరుసగా మూడోరోజు బాదుడే.. హైదరాబాద్‌లో తులం బంగారం ఎంతంటే?
రియల్‌మీ 14 ప్రో మొబైల్ స్వెడ్ గ్రే కలర్‌లో లాంచ్ కానున్నాయి. అయితే పెర్ల్ వైట్ వేరియంట్ ప్రత్యేక ఆకృతిని కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ చాలా స్లిమ్‌గా ఉంటుంది. ఇది మిరుమిట్లు గొలిపే ముత్యం లాంటి షైన్‌ను కలిగి ఉంటుంది. ఫోన్ వెనుక ప్యానెల్ బిన్నంగా ఉంటుంది. ఇది సహజమైన సముద్రపు షెల్‌ల మాదిరి కనిపిస్తుంది. 1.6 ఎంఎం బెజెల్స్, 42-డిగ్రీ కర్వేచర్, 1.5K అమోలెడ్ డిస్‌ప్లే, ఐపీ69 రేటింగ్, ఓషన్ ఓకులస్ ట్రిపుల్-కెమెరా సిస్టమ్, మ్యాజిక్‌గ్లో ట్రిపుల్ ఫ్లాష్ టెక్నాలజీ, 6000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీతో ఈ ఫాన్స్ రానున్నాయి. ఈ సిరీస్ వినూత్న డిజైన్, సూపర్ ఫీచర్లతో వినియోగదారుకు గొప్ప అనుభవాన్ని అందించనుంది.