NTV Telugu Site icon

Realme 13 Pro Price: ‘రియల్‌మీ’ నుంచి మరో ఫోన్‌.. ఆ ఫీచర్‌తో వస్తున్న మొదటి స్మార్ట్‌ఫోన్‌ ఇదే!

Realme 13 Pro Launch

Realme 13 Pro Launch

Realme 13 Pro Series Launch and Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘రియల్‌మీ’ మరో స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ‘రియల్‌మీ 13 ప్రో’ సిరీస్‌ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తోంది. తాజాగా బ్యాంకాక్‌లో జరిగిన రియల్‌మీ ఏఐ ఇమేజింగ్ మీడియా ప్రివ్యూ ఈవెంట్‌లో ఈ సిరీస్‌కు సంబందించిన కొన్ని ఫీచర్‌లను కంపెనీ వెల్లడించింది. త్వరలోనే ఈ స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ విడుదల కానుంది. అధునాతన ఫీచర్లతో కూడిన ఈ ఫోన్‌ను తక్కువ బడ్జెట్‌లోనే తీసుకొస్తున్నారు. రియల్‌మీ 13 ప్రో సిరీస్‌ ఫీచర్‌లను ఓసారి చూద్దాం.

రియల్‌మీ 13 ప్రో సిరీస్‌లో భాగంగా రియల్‌మీ 13 ప్రో ప్లస్, రియల్‌మీ 13 ప్రో స్మార్ట్‌ఫోన్‌లను కంపెనీ లాంచ్‌ చేయనుంది. ఈ సిరీస్‌లో ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత అల్ట్రా క్లియర్‌ కెమెరాను ఇస్తున్నారు. సోనీ ఎల్వైటీ 701తో వస్తున్న ప్రంచంలోనే మొదటి స్మార్ట్‌ఫోన్‌ ఇదే అని రియల్‌మీ పేర్కొంది. సిరీస్‌లో కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ప్రో+లో డ్యూయల్ మెయిన్ కెమెరా సిస్టమ్ ఉంటుంది. సోనీ ఎల్వైటీ-701 కెమెరా సెన్సార్‌తో 50MP ఓఐఎస్ మెయిన్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌కు సపోర్ట్ చేసే సోనీ ఎల్వైటీ 600తో 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి.

Also Read: Rahul Dravid Bharat Ratna: ఎన్నో అద్భుతాలు సృష్టించాడు.. ద్రవిడ్‌కు ‘భారతరత్న’ ఇవ్వాలి: సన్నీ

హైపర్ ఇమేజ్+ త్రీ లేయర్ ఏఐ ఇమేజింగ్ ఆర్కిటెక్చర్‌తో ఈ సిరీస్‌లో కెమెరా సిస్టమ్‌ను వినూత్నంగా తీసుకొస్తున్నారు. ఇందులో ఏఐ ఇమేజింగ్ ఆలగోరిథమ్స్, క్లౌడ్ బేస్డ్ ఏఐ ఇమేజ్ ఎడిటిండ్‌ సపోర్ట్‌ చేసే ఫీచర్లను కూడా ఇచ్చారు. ఏఐ ప్యూర్ బొకెహ్, ఏఐ నాచురల్ స్కిన్ టోన్, ఏఐ అల్ట్రా క్లారిటీ వంటి అధునాతన ఫీచర్లు ఈ ఫోన్ సొంతం. ఈ సిరీస్‌లో 6.7 ఇంచెస్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లే,120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 7ఎస్ జెన్ 3 ప్రాసెసర్‌ ఉండనున్నాయి. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. 80 వాట్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5050 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇందులో ఉంటుంది.