Realme 13 Pro Price: ‘రియల్‌మీ’ నుంచి మరో ఫోన్.. ఆ ఫీచర్‌తో వస్తున్న మొదటి స్మార్ట్‌ఫోన్ ఇదే!
- బ్యాంకాక్‌లో మీడియా ప్రివ్యూ ఈవెంట్
- రియల్‌మీ నుంచి మరో స్మార్ట్‌ఫోన్
- కెమెరాకు అధిక ప్రాధాన్యత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Realme 13 Pro Series Launch and Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘రియల్‌మీ’ మరో స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ‘రియల్‌మీ 13 ప్రో’ సిరీస్ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తోంది. తాజాగా బ్యాంకాక్‌లో జరిగిన రియల్‌మీ ఏఐ ఇమేజింగ్ మీడియా ప్రివ్యూ ఈవెంట్‌లో ఈ సిరీస్‌కు సంబందించిన కొన్ని ఫీచర్‌లను కంపెనీ వెల్లడించింది. త్వరలోనే ఈ స్మార్ట్‌ఫోన్ భారత్ విడుదల కానుంది. అధునాతన ఫీచర్లతో కూడిన ఈ ఫోన్‌ను తక్కువ బడ్జెట్‌లోనే తీసుకొస్తున్నారు. రియల్‌మీ 13 ప్రో సిరీస్ ఫీచర్‌లను ఓసారి చూద్దాం.
రియల్‌మీ 13 ప్రో సిరీస్‌లో భాగంగా రియల్‌మీ 13 ప్రో ప్లస్, రియల్‌మీ 13 ప్రో స్మార్ట్‌ఫోన్‌లను కంపెనీ లాంచ్ చేయనుంది. ఈ సిరీస్‌లో ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అల్ట్రా క్లియర్ కెమెరాను ఇస్తున్నారు. సోనీ ఎల్వైటీ 701తో వస్తున్న ప్రంచంలోనే మొదటి స్మార్ట్‌ఫోన్ ఇదే అని రియల్‌మీ పేర్కొంది. సిరీస్‌లో కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ప్రో+లో డ్యూయల్ మెయిన్ కెమెరా సిస్టమ్ ఉంటుంది. సోనీ ఎల్వైటీ-701 కెమెరా సెన్సార్‌తో 50MP ఓఐఎస్ మెయిన్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌కు సపోర్ట్ చేసే సోనీ ఎల్వైటీ 600తో 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
Also Read: Rahul Dravid Bharat Ratna: ఎన్నో అద్భుతాలు సృష్టించాడు.. ద్రవిడ్‌కు ‘భారతరత్న’ ఇవ్వాలి: సన్నీ
హైపర్ ఇమేజ్+ త్రీ లేయర్ ఏఐ ఇమేజింగ్ ఆర్కిటెక్చర్‌తో ఈ సిరీస్‌లో కెమెరా సిస్టమ్‌ను వినూత్నంగా తీసుకొస్తున్నారు. ఇందులో ఏఐ ఇమేజింగ్ ఆలగోరిథమ్స్, క్లౌడ్ బేస్డ్ ఏఐ ఇమేజ్ ఎడిటిండ్ సపోర్ట్ చేసే ఫీచర్లను కూడా ఇచ్చారు. ఏఐ ప్యూర్ బొకెహ్, ఏఐ నాచురల్ స్కిన్ టోన్, ఏఐ అల్ట్రా క్లారిటీ వంటి అధునాతన ఫీచర్లు ఈ ఫోన్ సొంతం. ఈ సిరీస్‌లో 6.7 ఇంచెస్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లే,120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 3 ప్రాసెసర్ ఉండనున్నాయి. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. 80 వాట్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5050 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉంటుంది.
తాజావార్తలు
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!