Realme 13 Pro 5G Launch: రియల్మీ నుంచి రెండు సూపర్ స్మార్ట్ఫోన్లు.. నయా ఫీచర్, బిగ్ బ్యాటరీ!
- రియల్మీ నుంచి సూపర్ స్మార్ట్‌ఫోన్
- సోనీ ఎల్వైటీ 600 పెరిస్కోప్ లెన్స్
- 5050 ఎంఎహెచ్ బిగ్ బ్యాటరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Realme 13 Pro 5G Launch Date and Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘రియల్మీ’ మరో రెండు సూపర్ స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. రియల్మీ 13 ప్రో, రియల్మీ 13 ప్రో ప్లస్ ఫోన్లను విడుదల చేయనుంది. జులై 30వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్లను రియల్మీ లాంచ్ చేయనుంది. బ్యాంకాక్‌లో జరిగిన రియల్మీ ఏఐ ఇమేజింగ్ మీడియా ప్రివ్యూ ఈవెంట్లో ఈ సిరీస్‌కు సంబందించిన కొన్ని ఫీచర్లను కంపెనీ వెల్లడించింది. అధునాతన ఫీచర్లతో కూడిన ఈ ఫోన్ల ధరలు కాస్త ఎక్కువే అని తెలుస్తోంది.
రియల్మీ 13 ప్రో, రియల్మీ 13 ప్రో ప్లస్ స్మార్ట్ఫోన్లలో ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అల్ట్రా క్లియర్ కెమెరాను ఇస్తున్నారు. సోనీ ఎల్వైటీ 600 పెరిస్కోప్ లెన్స్, సోనీ ఎల్వైటీ 701 పెరిస్కోప్ లెన్స్‌తో వస్తున్న ప్రంచంలోనే మొదటి ఫోన్లు ఇవే అని రియల్మీ పేర్కొంది.లెన్స్‌తో ఫొటోలు అద్భుతంగా రానున్నాయి. ఏఐ స్మార్ట్ రిమూవల్ ఆప్షన్ కూడా ఉంటుందట. ఈ రెండు స్మార్ట్ఫోన్లలో కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
రియల్మీ 13 ప్రో ప్లస్‌లో డ్యూయల్ మెయిన్ కెమెరా సిస్టమ్ ఉంటుంది. సోనీ ఎల్వైటీ 701 సెన్సార్‌తో 50MP ఓఐఎస్ మెయిన్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌కు సపోర్ట్ చేసే సోనీ ఎల్వైటీ 600తో 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉంటుంది. 8-మెగా పిక్సెల్ సెకండరీ సెన్సర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరాను కూడా ఇవ్వనున్నారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 5050 ఎంఎహెచ్ బిగ్ బ్యాటరీని ఇస్తున్నారు.
Also Read: IPL 2025: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్.. ఇద్దరు స్టార్ ప్లేయర్లు గుడ్‌బై!
ఈ స్మార్ట్ఫోన్లలో 6.7 ఇంచెస్‌తో కూడిన అమోఎల్ఈడీ డిస్ప్లేతో రానున్నాయి. 1080×2412 పిక్సల్స్ ఈ స్క్రీన్ సొంతం. 2.4 గిగా హెర్ట్జ్ ఒక్టాకోర్ ప్రాసెసర్‌తో ఇది రన్ అవుతుంది. అడ్రెనో 710 జీపీయూ ప్రాసెసర్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్లలో 16 జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజ్ ఇవ్వనున్నారు. రియల్మీ నుంచి వస్తున్న తొలి ప్రొఫెషనల్ ఫోన్ ఇదే. ఈ ఫోన్లు మోనెట్ గోల్డ్, మోనెట్ పర్పుల్ కలర్స్‌లో అంబాటులో ఉండనున్నాయి. అధునాతన ఫీచర్లతో వస్తోన్న ఈ స్మార్ట్ఫోన్ల ధరలు రూ. 30-40 వేల పైగానే ఉండనున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!