NTV Telugu Site icon

Realme 13 Pro 5G Launch: రియల్‌మీ నుంచి రెండు సూపర్ స్మార్ట్‌ఫోన్‌లు.. నయా ఫీచర్‌, బిగ్ బ్యాటరీ!

Realme 13 Pro 5g

Realme 13 Pro 5g

Realme 13 Pro 5G Launch Date and Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘రియల్‌మీ’ మరో రెండు సూపర్ స్మార్ట్‌ఫోన్‌లను భారత మార్కెట్‌లో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. రియల్‌మీ 13 ప్రో, రియల్‌మీ 13 ప్రో ప్లస్ ఫోన్‌లను విడుదల చేయనుంది. జులై 30వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్‌లను రియల్‌మీ లాంచ్‌ చేయనుంది. బ్యాంకాక్‌లో జరిగిన రియల్‌మీ ఏఐ ఇమేజింగ్ మీడియా ప్రివ్యూ ఈవెంట్‌లో ఈ సిరీస్‌కు సంబందించిన కొన్ని ఫీచర్‌లను కంపెనీ వెల్లడించింది. అధునాతన ఫీచర్లతో కూడిన ఈ ఫోన్‌ల ధరలు కాస్త ఎక్కువే అని తెలుస్తోంది.

రియల్‌మీ 13 ప్రో, రియల్‌మీ 13 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లలో ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత అల్ట్రా క్లియర్‌ కెమెరాను ఇస్తున్నారు. సోనీ ఎల్‌వైటీ 600 పెరిస్కోప్ లెన్స్‌, సోనీ ఎల్‌వైటీ 701 పెరిస్కోప్ లెన్స్‌తో వస్తున్న ప్రంచంలోనే మొదటి ఫోన్‌లు ఇవే అని రియల్‌మీ పేర్కొంది.లెన్స్‌తో ఫొటోలు అద్భుతంగా రానున్నాయి. ఏఐ స్మార్ట్ రిమూవల్ ఆప్షన్ కూడా ఉంటుందట. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లలో కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు.

రియల్‌మీ 13 ప్రో ప్లస్‌లో డ్యూయల్ మెయిన్ కెమెరా సిస్టమ్ ఉంటుంది. సోనీ ఎల్‌వైటీ 701 సెన్సార్‌తో 50MP ఓఐఎస్ మెయిన్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌కు సపోర్ట్ చేసే సోనీ ఎల్‌వైటీ 600తో 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉంటుంది. 8-మెగా పిక్సెల్ సెకండరీ సెన్సర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరాను కూడా ఇవ్వనున్నారు. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 32 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 5050 ఎంఎహెచ్ బిగ్ బ్యాటరీని ఇస్తున్నారు.

Also Read: IPL 2025: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్.. ఇద్దరు స్టార్ ప్లేయర్‌లు గుడ్‌బై!

ఈ స్మార్ట్‌ఫోన్‌లలో 6.7 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేతో రానున్నాయి. 1080×2412 పిక్సల్స్ ఈ స్క్రీన్‌ సొంతం. 2.4 గిగా హెర్ట్జ్ ఒక్టాకోర్ ప్రాసెసర్‌తో ఇది రన్ అవుతుంది. అడ్రెనో 710 జీపీయూ ప్రాసెసర్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌లలో 16 జీబీ ర్యామ్‌, 1టీబీ స్టోరేజ్‌ ఇవ్వనున్నారు. రియల్‌మీ నుంచి వస్తున్న తొలి ప్రొఫెషనల్‌ ఫోన్‌ ఇదే. ఈ ఫోన్లు మోనెట్ గోల్డ్, మోనెట్ పర్పుల్ కలర్స్‌లో అంబాటులో ఉండనున్నాయి. అధునాతన ఫీచర్లతో వస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ల ధరలు రూ. 30-40 వేల పైగానే ఉండనున్నట్లు తెలుస్తోంది.