NTV Telugu Site icon

Real Estate: హైదరాబాద్‌లో వరుసగా మూతపడుతున్న రియల్ ఎస్టేట్ సంస్థలు

Hyderabad Real Estate

Hyderabad Real Estate

Real Estate: ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రకటనలు ఇప్పించి కస్టమర్లను ఆకర్షంచే ప్రయత్నం చేస్తున్నాయి. సొంతిల్లు కట్టుకోవాలనే ఆశతో డబ్బులు కూడగట్టుకున్న మధ్యతరగతి వ్యక్తి.. ఆ ప్రకటనలు చూసి వెంచర్లలో స్థలాలను కొనుగోలు చేస్తున్నారు. అదే అదనుగా కొందరు రియల్ ఎస్టేట్ మోసాలకు పాల్పడుతున్నారు. సాధారణ ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి తర్వాత ముఖం చాటేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ సంస్థలు వరుసగా మూతపడుతున్నాయి. ఫ్రీ లాంచ్ ఆఫర్ ,బై బ్యాక్ పాలసీ పేర్లతో రియల్ ఎస్టేట్ కంపెనీలు నిండా ముంచుతున్నాయి. ఒక సైబరాబాద్‌లోనే 22 ఫ్రీ లాంచ్ ఆఫర్, 12 బై బ్యాక్ పాలసీ పేరుతో సంస్థలు మోసానికి పాల్పడ్డాయి.

Read Also: Kishan Reddy: ఏడాది అయినా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

దాదాపు 3000 కోట్ల రూపాయలను రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రజల నుంచి వసూలు చేశాయి. లేని స్థలాలను ఉన్నట్టుగా చూపి రియల్ సంస్థలు డబ్బులు వసూలు చేశాయి. ప్రాజెక్టు మీద డబ్బులు ఇస్తామంటూ బై బ్యాక్ పాలసీ పేరుతో మోసాలు జరిగాయి. పలు ప్రాంతాలలో విలువైన ల్యాండ్ చూపెట్టి రియల్ కంపెనీలు మోసాలు చేస్తున్నాయి. తక్కువ ధరకే విల్లాలు, ఫ్లాట్లు ఫామ్ ల్యాండ్స్ అంటూ ప్రచార ఆర్భాటాలను చూసి వినియోగదారులు పడిపోతున్నారు. సైబరాబాద్ పరిధిలోనే ఎక్కువగా ఫ్రీ లాంచ్, బై బ్యాక్ మోసాలు జరిగినట్లు లెక్కలు చూపుతున్నాయి.

Show comments