Site icon NTV Telugu

RCB vs SRH: టాప్ ప్లేస్ పై కన్నేసిన ఆర్సీబీ.. మొదట బ్యాటింగ్ చేయనున్న సన్‌రైజర్స్..!

Rcb Vs Srh

Rcb Vs Srh

RCB vs SRH: నేడు (శుక్రవారం) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య లక్నో వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ప్రస్తుత సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 17 పాయింట్లతో రెండవ స్థానంలో ఉంది. రజత్ పాటిదార్ నేతృత్వంలోని బెంగళూరు జట్టు ఈరోజు మ్యాచ్ గెలిస్తే, టేబుల్ టాపర్‌గా నిలుస్తుంది. మరోవైపు, సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ ప్రయాణాన్ని విజయంతో ముగించాలని భావిస్తోంది. ఇకపోతే, ఈ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెగ్యులర్ కెప్టెన్ రజత్ పాటిదార్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడనున్నాడు. అతని స్థానంలో జితేష్ శర్మ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. టాస్ గెలిచిన బెంగళూరు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీనితో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇక నేటి మ్యాచ్ సంబంధించిన ప్లేయింగ్ XI ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Read Also: Miss World 2025: తెలంగాణను ప్రశంసలతో ముంచెత్తిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు..!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్, జితేశ్ శర్మ (కెప్టెన్, వికెట్ కీపర్), రోమారియో షెఫర్డ్, టిమ్ డేవిడ్, క్రునాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్, లుంగి ఎన్‌గిడీ, సుయాష్ శర్మ

ఇంపాక్ట్ ప్లేయర్స్: రజత్ పటీదార్, రసిఖ్ దార్, మనోజ్ భండగే, జాకబ్ బెథెల్, స్వప్నిల్ సింగ్

Read Also: Gautam Gambhir: 2027 వరల్డ్ కప్ వరకు కష్టమే.. ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన గంభీర్..!

సన్‌రైజర్స్ హైదరాబాద్:
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, ఎషాన్ మలింగ, జయదేవ్ ఉనద్కట్

ఇంపాక్ట్ ప్లేయర్స్: మహమ్మద్ షమీ, హర్ష్ దుబే, సచిన్ బేబీ, జీషాన్ అంసారీ, సిమర్జీత్ సింగ్.

Exit mobile version