RCB vs GT: వర్షం వల్ల క్వాలిఫయర్-1 రద్దయితే ఫైనల్ చేరేది ఎవరు.! రూల్స్ ఏమంటున్నాయంటే.?
- IPL 2026 క్వాలిఫయర్-1లో తలపడనున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT).
- సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం
- ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (HPCA) స్టేడియంలో మ్యాచ్..
- వర్షం వల్ల మ్యాచ్ రద్దు అయితే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RCB vs GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ ప్లేఆఫ్స్ దశకు చేరుకుంది. ప్లేఆఫ్స్ పోరులో భాగంగా నేడు (మే 26) ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (HPCA) స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు క్వాలిఫయర్-1లో అమితుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు నేరుగా ఫైనల్ కు అర్హత సాధిస్తుంది.
సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ధర్మశాలలో వాతావరణం అనుకూలంగానే ఉంటుందని అంచనాలు ఉన్నప్పటికీ, కొండ ప్రాంతం కావడంతో వాతావరణం ఎప్పుడు మారుతుందో చెప్పడం కష్టం. దీంతో అభిమానుల్లో ఒక సందేహం నెలకొంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా రద్దయితే ఫైనల్‌కు వెళ్లేది ఏ జట్టు అనే చర్చ సాగుతోంది.
Also Read
- Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
- DoT SIM Card Warning: మీ పేరు మీద సిమ్‌ను వేరొకరు వాడుతున్నారా? మీకు రూ.50 లక్షల వరకు జరిమానా!, పైగా శిక్ష..
- Faria: నేనింకా ఇల్లు కొనలేదు.. సందీప్ కిషన్ చెప్పాక కొనాలనుకున్నా.!
- Danam Nagender: సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నా.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ..!
ఐపీఎల్ ప్లేయింగ్ కండిషన్స్ ప్రకారం.. క్వాలిఫయర్-1, క్వాలిఫయర్-2, ఎలిమినేటర్ లేదా ఫైనల్ మ్యాచ్ టై అయినా, ఫలితం రాకపోయినా ముందుగా సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. అవసరమైతే మరిన్ని సూపర్ ఓవర్లు కూడా ఆడిస్తారు. అయితే వర్షం లేదా ఇతర కారణాల వల్ల సూపర్ ఓవర్ నిర్వహించడం కూడా సాధ్యం కాకపోతే, అప్పుడు లీగ్ దశలో పాయింట్ల పట్టికలో ఉన్న స్థానాన్ని ఆధారంగా తీసుకుని విజేతను నిర్ణయిస్తారు.
అంటే ఈ మ్యాచ్ పూర్తిగా వర్షం కారణంగా రద్దయితే.. లీగ్ స్టేజ్‌లో టాప్‌లో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఇక గుజరాత్ టైటాన్స్ మాత్రం క్వాలిఫయర్-2 ఆడాల్సి ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. IPL 2026 ప్లేఆఫ్స్‌లో క్వాలిఫయర్-1, క్వాలిఫయర్-2, ఎలిమినేటర్ మ్యాచ్‌లకు బీసీసీఐ రిజర్వ్ డే ప్రకటించలేదు. గత సీజన్లలో కూడా ఇదే విధానం కొనసాగింది. అయితే ఫైనల్ మ్యాచ్‌కు మాత్రం రిజర్వ్ డే ఉండే అవకాశం ఉంటుంది.
ఈ నియమాల వల్ల లీగ్ దశలో ప్రతి మ్యాచ్ ఎంతో కీలకంగా మారుతుంది. కేవలం ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడం మాత్రమే కాకుండా, టాప్-2లో నిలవడం కూడా ఎంతో ముఖ్యం. ఎందుకంటే వర్షం వంటి అనూహ్య పరిస్థితుల్లో లీగ్ స్టేజ్‌లో బాగా ఆడిన జట్టుకే ప్రయోజనం కలుగుతుంది.
ఆర్సీబీ ప్లేయింగ్ XI:
విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (C), జితేష్ శర్మ (W), కృనాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయష్ శర్మ, రసిక్ సలామ్ దార్.
గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ XI:
సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (C), జోస్ బట్లర్ (W), వాషింగ్టన్ సుందర్, జేసన్ హోల్డర్, రాహుల్ తేవతియా, రషీద్ ఖాన్, కగిసో రబడా, అర్షద్ ఖాన్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, నిశాంత్ సింధు.
తాజావార్తలు
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
Turkey Earthquake: టర్కీలో భారీ భూకంపం.. 5.8 తీవ్రతతో కంపించిన భూమి
-
DoT SIM Card Warning: మీ పేరు మీద సిమ్‌ను వేరొకరు వాడుతున్నారా? మీకు రూ.50 లక్షల వరకు జరిమానా!, పైగా శిక్ష..
-
Faria: నేనింకా ఇల్లు కొనలేదు.. సందీప్ కిషన్ చెప్పాక కొనాలనుకున్నా.!
-
Danam Nagender: సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నా.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!