NTV Telugu Site icon

RCB vs DC: ఆర్సీబీ దూకుడును కట్టడి చేసిన డీసీ బౌలర్లు.. ఢిల్లీ క్యాపిటల్ టార్గెట్ ఎంతంటే?

Rcb Vs Dc

Rcb Vs Dc

RCB vs DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో భాగంగా బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఇక ఇన్నింగ్స్ ఆరంభంలో ఫిల్ సాల్ట్ మెరుపు ఆరంభాన్ని అందించాడు. కేవలం 17 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 37 పరుగులు చేసి తన పవర్ హిట్టింగ్‌ను చాటిచెప్పాడు. అయితే చిన్న తప్పడంతో రనౌట్ అయ్యాడు. ఇక విరాట్ కోహ్లీ క్రీజ్‌లో నిలవలేకపోయాడు. 14 బంతుల్లో 22 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కెప్టెన్ రాజత్ పటిదార్ 23 బంతుల్లో 25 పరుగులు చేశాడు. ఇక ఇన్నింగ్స్ పదో ఓవర్ల నుంచి మధ్యలో బెంగళూరు జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. లివింగ్‌స్టోన్ (4), జితేష్ శర్మ (3), క్రునాల్ పాండ్యా (18) వంటి ఆటగాళ్లు తక్కువ పరుగులకే ఔట్ అయ్యారు. కానీ చివర్లో టిమ్ డేవిడ్ ఆకట్టుకునే ఇన్నింగ్స్ ఆడాడు. అతను కేవలం 20 బంతుల్లోనే రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 37 పరుగులు చేసి రన్ రేట్‌ను పెంచాడు. దీనితో మొత్తంగా RCB జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది.

Read Also: Bangladesh: బంగ్లాదేశీయులు బాటా, పిజ్జా హట్, కేఎఫ్‌సీలపై ఎందుకు దాడులు చేస్తున్నారు..?

ఢిల్లీ బౌలింగ్‌లో విప్రాజ్ నిగమ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. అతను 4 ఓవర్లలో కేవలం 18 పరుగులు ఇచ్చి రెండు కీలక వికెట్లు తీసుకున్నాడు. అలాగే స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా 4 ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. మోహిత్ శర్మ కూడా 2 ఓవర్లలో 10 పరుగులతో ఓ వికెట్ తీసి కీలక పాత్ర పోషించాడు.