RCB vs DC: కోహ్లీ మెరుపులు కాసేపే.. భారీ స్కోరు మిస్సైన బెంగళూరు! ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RCB vs DC: ఐపీఎల్ 2026లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరులో బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీకి ఓపెనర్లు విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ శుభారంభం అందించినప్పటికీ, ఢిల్లీ బౌలర్లు మధ్య ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి స్కోరు వేగాన్ని కట్టడి చేశారు. ఆర్సీబీ ఓపెనర్లు కోహ్లీ (19), సాల్ట్ (63) తొలి ఓవర్ నుంచే ధాటిగా ఆడారు. మొదటి ఓవర్లోనే 13 పరుగులు రాబట్టి ఇన్నింగ్స్ వేగంగా మొదలుపెట్టారు. అయితే లుంగీ ఎన్గిడి వేసిన 6వ ఓవర్లో కోహ్లీ భారీ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఫిల్ సాల్ట్ నిలకడగా ఆడుతూ 38 బంతుల్లో 63 పరుగులు (4 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో సాల్ట్ అవుట్ కావడంతో ఆర్సీబీ ఇన్నింగ్స్ స్లో అయ్యింది.
READ ALSO: Mangalavaaram: కొరటాల శివ నిర్మాణంలో ‘మంగళవారం 2’?
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ఢిల్లీ బౌలర్ల ఆధిపత్యం
మధ్య ఓవర్లలో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ బెంగళూరు బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. రజత్ పాటిదార్ (8), దేవదత్ పడిక్కల్ (18) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. అక్షర్ పటేల్ కీలకమైన సమయంలో టిమ్ డేవిడ్ (26) వికెట్ తీసి ఆర్సీబీని దెబ్బతీశాడు. చివరి 5 ఓవర్లలో ఆర్సీబీ బ్యాటర్లు భారీ స్కోరు సాధిస్తారని అనుకున్నా, టీ నటరాజన్, లుంగీ ఎన్గిడి అద్భుతమైన యార్కర్లతో ఆర్సీబీ బ్యాటర్లను కట్టడి చేశారు. 19వ ఓవర్లో కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చి ఢిల్లీ పైచేయి సాధించింది. చివరి ఓవర్లో భువనేశ్వర్ కుమార్ క్రీజులోకి వచ్చి ఒకట్రెండు పరుగులు తీయడంతో బెంగళూరు స్కోరు 171కి చేరింది. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీయగా, ఎన్గిడి, ముఖేష్ కుమార్ చెరో వికెట్ పడగొట్టారు. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగుతున్న ఢిల్లీకి ఆర్సీబీ బౌలర్లు ఎలాంటి సవాల్ విసురుతారో చూడాలి.
READ ALSO: Iran Vs USA: 50 రోజుల తర్వాత గగనతలాన్ని తెరిచిన ఇరాన్..
తాజావార్తలు
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!