Site icon NTV Telugu

RCB vs CSK: ఐపీఎల్‌లో నేడు రెండు బడా జట్ల మధ్య ఫైట్‌

Ipl

Ipl

ఐపీఎల్‌ టోర్నీలో నేడు మరో రెండు బడా జట్ల మధ్య పోరు జరగనుంది. బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌, రాయల్ ఛాలెంజర్స్‌ బెంగుళూరు జట్లు తలపడనున్నాయి. గత మ్యాచ్‌ ఓటమితో గెలుపు బాట పట్టాలని CSK కసరత్తు చేస్తోంది. మరోవైపు సొంతగడ్డపై మ్యాచ్‌ కావడంతో మరో విజయం నమోదు చేయాలని RCB భావిస్తోంది. ఇవాళ రాత్రి ఏడున్నరకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. రెండు జట్లు ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండింట్లో గెలిచాయి. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసిన RCB తన మునుపటి ఆటలో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 23 పరుగుల తేడాతో ఓడించింది. విరాట్ కోహ్లి మరియు ఫాఫ్ డు ప్లెసిస్ జట్టుకు శుభారంభం అందించి పవర్‌ప్లేలో 47 పరుగులు చేశారు. హర్షల్ పటేల్‌ను ఐదవ స్థానానికి ప్రమోట్ చేయడం RCBకి పని చేయలేదు, ఎందుకంటే అతను ఆరు పరుగులు మాత్రమే చేయగలడు. షహబాజ్ అహ్మద్ తన ఇన్నింగ్స్‌లో 12 బంతుల్లో 20 పరుగులతో జట్టుకు కొంత ఫినిషింగ్ టచ్ అందించాడు. పవర్‌ప్లేలో క్యాపిటల్స్ నాలుగు వికెట్లు కోల్పోయింది, ఇది వారిని బ్యాక్‌ఫుట్‌కు నెట్టింది. మనీష్ పాండే హాఫ్ సెంచరీ చేసినా జట్టును దాటలేకపోయాడు.

ఇక, ఐపీఎల్ లో సండే రోజు జరిగిన మ్యాచ్ లో మెరుపులు మెరిశాయి. గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఉత్కంఠ భరిత మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. 178 రన్స్ టార్గెట్ తో క్రీజులోకి దూకిన రాజస్థాన్ రాయల్స్.. 19.2 ఓవర్లలోనే విజయం సాధించింది. హార్డ్‌ హిట్టర్‌ షిమ్రోన్‌ హిట్‌మైర్‌.. 26 బంతుల్లో 56 బాదేశాడు. సంజూ శాంసన్‌ 60 పరుగులతో రాజస్థాన్ విక్టరీలో కీ రోల్ పోషించాడు. దీంతో మరో నాలుగు బంతులు మిగిలివుండగానే, గెలుపు బావుటా ఎగరేసింది రాజస్థాన్.

మరోవైపు.. కోల్ కతా, ముంబై మ్యాచ్ కూడా ప్రేక్షకులను మాంచి థ్రిల్ ఇచ్చింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 185 రన్స్ చేసింది. వెంకటేష్‌ అయ్యర్ సెంచరీ కొట్టడంతో కేకేఆర్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. అయితే, 186 రన్స్ లక్ష్యంతో చేజింగ్ కు దిగిన ముంబై బ్యాటర్లు చెలరేగి ఆడారు. ఇషాన్‌, సూర్య బ్యాటింగ్ తో పరుగులు యమ ఫాస్ట్ గా వచ్చాయి. దీంతో 17.4 ఓవర్లలోనే ఐదు వికెట్ల నష్టానికి ముంబై విక్టరీ కొట్టింది.

Exit mobile version