NTV Telugu Site icon

RCB: ఆర్సీబీ పేరు మార్పు.. ఇక నుంచి..!

Rcb

Rcb

ఆర్సీబీ (RCB) పేరు మారింది. Royal Challengers Bangalore గా ఉన్న ఫ్రాంచైజీ పేరును Royal Challengers Bengaluruగా మార్చారు. ఈ విషయాన్ని ఆర్సీబీ అధికారిక ఎక్స్ పేజీలో షేర్ చేశారు. ఈరోజు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆర్సీబీ అన్ బాక్స్ 2024 కార్యక్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే 2014వ సంవత్సరంలో నగరం పేరును Bangalore నుంచి Bengaluruగా స్పెల్లింగ్ మార్చారు.

అయితే సిటీ పేరు అధికారికంగా మారినా.. ఆర్సీబీ జట్టును రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుగానే ఉండేది. అయితే.. కర్ణాటక క్రికెట్ అభిమానులు మాత్రం పేరును మార్చాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. అయితే.. ఇప్పటికీ సాకారమైంది. ఇదిలా ఉంటే.. ఆర్సీబీ ఇంతకు ముందు ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఆ వీడియోలో ప్రముఖ హీరోయిన్ రష్మిక మంధనా కనిపిస్తూ.. క్యారవాన్ లోకి ఎక్కి అద్దంపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అని రాసి ఉంటే.. అందులో బెంగళూరు అనే పదాన్ని నోటితో ఊది చెరిపేసింది. అయితే అప్పటికీ ఎవరికి అర్థం కాలేదు.. బెంగళూరు అనే పదం తీసేస్తున్నారా? లేదంటే మొత్తానికే పేరును మార్చి.. కొత్త పేరుతో బరిలోకి దిగుతున్నారా? అనే అనుమానాలు అభిమానుల్లో ఉండేది. కానీ.. నేటితో ఆ సస్పెన్స్ కు ముగింపు పలికింది.

ఇదిలా ఉంటే.. ఆర్సీబీ కొత్త లోగో, కొత్త జెర్సీ లాంచ్ చేసింది. ఈ కార్యక్రమంలో.. ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, ఆర్సీబీ మహిళల టీమ్ కెప్టెన్ స్మృతీ మందాన పాల్గొన్నారు. ఇటు.. పేరు మార్చడం, కొత్త జెర్సీ, కొత్త లోగో ఆవిష్కరించడంపై.. కొత్త శకం మొదలైందని, ఇక నుంచి తమకు అన్నీ విజయాలేనంటూ ఆర్సీబీ ధీమా వ్యక్తం చేస్తుంది. ఇక.. మార్చి 22న తొలి మ్యాచ్ లోనే సొంత వేదిక చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో తలపడనుంది.