Site icon NTV Telugu

IPL 2025:’ఆర్‌సిబి గెలవకపోతే.. నేను నా భర్తకు విడాకులిస్తా’.. పోస్టర్‌ వైరల్

Rcb

Rcb

ఐపీఎల్ టైటిల్ కు అడుగు దూరంలో ఉంది ఆర్సీబీ. నిన్న పంజాబ్ కింగ్స్ తో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్ లో బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ లో అద్భుతమైన ప్రతిభ కనబర్చి ఘన విజయం సాధించింది. పంజాబ్‌ కింగ్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి ఐపీఎల్ 2025లో ఆర్సీబీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఈ సారి కప్పు మాదే అంటూ సంబరపడిపోతున్నారు. అయితే నిన్న మ్యాచ్ సందర్భంగా ఓ మహిళ చేతిలో పెద్ద బ్యానర్ పట్టుకుని కనిపించింది. దానిపై బోల్డ్ అక్షరాలతో ఆర్‌సిబి ఫైనల్ గెలవకపోతే, నేను నా భర్తకు విడాకులు ఇస్తాను అని రాసి ఉంది. ఈ ఫన్నీ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read:Virat Kohli: నీళ్లు అందిస్తాడు అంటూ.. యువ ఆటగాడిపై విరాట్‌ కోహ్లీ స్లెడ్జింగ్‌!

ఈ వింత పోస్టర్‌తో పెవిలియన్‌లో నిలబడి ఉన్న మహిళ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ​​మహిళకు తన జట్టుపై ఉన్న నమ్మకం, అభిమానం గురించి, ఆమె ఎందుకు అంత పెద్ద రిస్క్ తీసుకుంటుందనే దాని గురించి చర్చలు మొదలయ్యాయి. 2016 తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి. దీని కారణంగా ఆ జట్టు అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. మే 29న పంజాబ్ కింగ్స్‌ను ఓడించిన తర్వాత, అభిమానుల కోసం ఆర్‌సిబి టైటిల్ గెలవాలని ప్రార్థనలు చేస్తు్న్నారు.

Also Read:Salman Khurshid: ‘‘ప్రధాన సమస్య ముగిసింది’’.. ఆర్టికల్ 370 రద్దును ప్రశంసించిన కాంగ్రెస్ నేత..

మే 29న ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో, ఎరుపు రంగు చీర ధరించిన ఒక మహిళా అభిమాని మ్యాచ్ కే ఆకర్షణగా నిలిచింది. RCB అభిమాని అయిన ఈ మహిళ పసుపు రంగు బ్యానర్‌పై ఇలా రాసింది- RCB ఫైనల్ గెలవకపోతే, నేను నా భర్తకు విడాకులు ఇస్తాను. కింద @chiraiya_ho అని రాసి ఉంది. దానితో పాటు #KingKohli అని కూడా రాసి ఉంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఈసారి మనం ఓడిపోతే, మీ వల్ల ఒక జంట విడిపోతది అంటూ కామెంట్ చేస్తున్నారు.

Exit mobile version