Site icon NTV Telugu

PBKS vs RCB : కింగ్ కోహ్లీ వీర బాదుడు, దించికొట్టిన పడిక్కల్.. ఆర్సీబీ గ్రేట్ విక్టరీ..

Rcb1

Rcb1

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 డబుల్ హెడర్ తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడింది. టాస్ గెలిచిన ఆర్సీబీ మొదట బౌలింగ్ వేసింది. బరిలోకి దిగిన పంజాబ్‌ జట్టును 6 వికెట్లకు 157 పరుగుల స్కోరు చేసింది. ఆర్సీబీ7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. పడిక్కల్‌(61) దించికొట్టాడు. కింగ్ కోహ్లీ(73) వీర బాదుడు బాదాడు. వీరిద్దరూ మంచి భాగస్వామ్యం అందించారు. 43 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్‌ కోహ్లీ మరో చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో అత్యధిక అర్ధశతాకాలు సాధించిన ప్లేయర్‌గా నిలిచాడు.

READ MORE: Virat Kohli: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన కింగ్ కోహ్లీ.. అత్యధిక హాఫ్‌ సెంచరీలు..

పంజాబ్ నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీ కేవలం తొలి ఓవర్‌లోనే తొలి దెబ్బను ఎదుర్కొంది. ఫిల్ సాల్ట్ కేవలం(1) పరుగు మాత్రమే చేసి అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఇంగ్లిస్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. బరిలోకి దిగిన దేవదత్ పడిక్కల్‌, విరాట్ కోహ్లీ అబ్భుతంగా రాణించారు. ఇద్దరూ కలిసి 66 బంతుల్లో103 పరుగుల భాగస్వామ్యం చేశారు. హర్పీత్‌ బ్రార్‌ బౌలింగ్‌లో వధేరాకు క్యాచ్‌ ఇచ్చి పడిక్కల్‌ (61) వెనుదిరిగాడు. చివరి క్షణంలో రజత్‌ పటీదార్‌ (12) ఔట్ అయ్యాడు. జితేశ్‌ శర్మ (11), విరాట్ కోహ్లీ(73) నాటౌట్‌గా నిలిచారు. కాగా..పంజాబ్‌ కింగ్స్‌ బౌలింగ్‌లో అర్ష్‌దీప్‌ సింగ్‌, హర్పీత్‌ బ్రార్‌, చాహల్‌ తలో వికెట్‌ తీశారు

READ MORE: Health Tips: ఒత్తిడితో సతమతమవుతున్నారా? ఈ ఫుడ్స్ ను డైట్ లో చేర్చుకోండి!

Exit mobile version