Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ipl Rcb Champions Virat Kohli Said I Risked My Life For Rcb Victory In Ipl Final

Virat Kohli: ఈ విజయం కోసం నా జీవితాన్ని దారపోశా.. చివరి వరకు ఆర్‌సీబీకే ఆడుతాను!

Published Date :June 4, 2025 , 8:14 am
By Sampath Kumar
  • ఐపీఎల్ 2025 ఫైనల్లో ఆర్సీబీ విజయం
  • టైటిల్ కోసం నా జీవితాన్ని దారపోశా
  • ఈ రోజు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు
  • ఈ విజయం జట్టు, అభిమానులకు అంకితం
  • చివరి వరకు ఆర్‌సీబీకే ఆడుతాను
Virat Kohli: ఈ విజయం కోసం నా జీవితాన్ని దారపోశా.. చివరి వరకు ఆర్‌సీబీకే ఆడుతాను!
  • Follow Us :
  • google news
  • dailyhunt

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టైటిల్ విజయం కోసం తన జీవితాన్ని దారపోశా అని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఈ రోజు వస్తుందని తాను అస్సలు అనుకోలేదని, చివరి బంతి వేసిన వెంటనే భావోద్వేగానికి గురయ్యానని చెప్పాడు. ఆర్సీబీకి తాను చేయగలిగిందంతా చేశానని, చివరకు ఐపీఎల్ టైటిల్ గెలవడం ఒక అద్భుతమైన అనుభూతి అని పేర్కొన్నాడు. ఈ విజయం జట్టుతో పాటు అభిమానులందరి అని విరాట్ స్పష్టం చేశాడు. మంగళవారం అహ్మదాబాద్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్లో ఆర్సీబీ 6 పరుగుల తేడాతో గెలుపొంది టైటిల్ కైవసం చేసుకుంది.

మ్యాచ్ అనంతరం కామెంటేటర్ మ్యాథ్యూ హేడెన్‌తో విరాట్ కోహ్లీ మాట్లాడాడు. ‘ఈ విజయం ఆర్సీబీ జట్టుకు ఎంత ముఖ్యమో, అభిమానులకు కూడా అంతే ముఖ్యం. 18 సంవత్సరాలు గడిచాయి. ఈ జట్టుకు అన్నీ ఇచ్చాను. ఈ గెలుపు కోసం నా జీవితాన్ని దారపోశా. ప్రతి సీజన్‌లో టైటిల్ గెలవడానికి ప్రయత్నించాను, నేను ఏం చేయగలనో అన్నీ చేశాను. చివరకు ఈ క్షణం రావడం నమ్మశక్యం కాని అనుభూతి. ఈ రోజు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. చివరి బంతి వేయగానే నేను భావోద్వేగానికి గురయ్యాను. ఈ విజయం నాకు చాలా ముఖ్యం. నేను ఆర్సీబీ జట్టు కోసం ఎంతో శ్రమించాను. చివరకు ఐపీఎల్ టైటిల్ గెలవడం ఒక అద్భుతమైన అనుభూతి. ఈ విజయం ఆర్సీబీ జట్టుతో పాటు అభిమానులది కూడా. ఈ విజయం జట్టు, అభిమానులకు అంకితం’ అని కోహ్లీ చెప్పాడు.

Also Read: Virat Kohli: మైదానంలోనే ఏడ్చేసిన విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్!

‘ఏబీ డివిలియర్స్ ఆర్సీబీ కోసం ఎంతో చేశాడు. మ్యాచ్‌కు ముందే అతడిని కలిసి కప్ మనదే అని చెప్పాను. ట్రోఫీని తీసుకునేటప్పుడు కలిసి సంబరాలు చేసుకోవాలని కోరాను. ఆర్సీబీ కోసం డివిలియర్స్ ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇప్పటికీ అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అతడి పేరుపైనే ఉన్నాయి. ఏబీడి రిటైర్మెంట్ ప్రకటించి నాలుగేళ్లు అవుతున్నా.. ఈ జట్టుపై ఎంతో ప్రేమ చూపిస్తాడు. ఆర్సీబీ ఫాన్స్, జట్టుపై అతడికి ఉన్న ప్రేమను నేను మాటల్లో వర్ణించలేను. మాతో పోడియంపై కప్ అందుకునేందుకు అతడు పూర్తి అర్హుడు. నిజాయితీగా చెప్పాలంటే గత 18 సంవత్సరాలుగా నా దగ్గర ఉన్న ప్రతిదాన్ని నేను జట్టుకు ఇచ్చాను. నేను ఈ జట్టుకు విధేయుడిగానే ఉన్నాను. నాకు ఇతర ఆలోచనలు వచ్చినా ఈ జట్టుకే కట్టుబడి ఉన్నాను. మేనేజ్‌మెంట్‌ నాకు అండగా ఉంది. ఆర్సీబీకి కప్ అందించాలన్నదే నా కల. నా హృదయం, ఆత్మ బెంగళూరుతోనే ఉంది. నేను చివరి వరకు ఆర్‌సీబీకే ఆడుతాను’ అని కింగ్ చెప్పుకొచ్చాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • IPL 2025
  • IPL 2025 Final
  • RCB
  • RCB vs PBKS
  • VIRAT KOHLI

తాజావార్తలు

  • Iran US Israel War: ట్రంప్‌కు ట్రంప్ స్టైల్‌లోనే కౌంటర్.. ఇరాన్ కొత్త ప్లాన్ రెడీ.. ఇక యుద్ధానికి ఎండ్ కార్డు?

  • Tina Ambani: అంబానీ కుటుంబంలో విషాదం.. కన్నీళ్లు పెట్టుకున్న టీనా అంబానీ

  • Raghav Chadha vs AAP: మోడీకి భయపడి సమోసాల ధరల గురించి మాట్లాడతావా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం

  • SDT 19: మెగా మేనల్లుడితో ‘క’ డైరెక్టర్స్ క్రేజీ ప్రాజెక్ట్.. అనౌన్స్‌మెంట్ పోస్టర్ చూశారా

  • Exclusive : రామ్ చరణ్ ‘పెద్ది’ ఏప్రిల్ 30న రిలీజ్ ఫిక్స్.. బుకింగ్స్ ఓపెన్

ట్రెండింగ్‌

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions