Virat Kohli: మైదానంలోనే ఏడ్చేసిన విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్!
- ఐపీఎల్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
- ఆర్సీబీ18 ఏళ్ల నిరీక్షణకు తెర
- భావోద్వేగానికి గురైన విరాట్ కోహ్లీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఎట్టకేలకు ఐపీఎల్ విజేతగా నిలిచింది. తొలి ఎడిషన్ నుంచి కప్ కోసం నిరీక్షించిన ఆర్సీబీ.. 18 ఏళ్లకు ఛాంపియన్ అయింది. మంగళవారం అహ్మదాబాద్‌లో ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో పంజాబ్ కింగ్స్‌పై ఆర్సీబీ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బెంగళూరు 9 వికెట్లకు 190 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (43; 35 బంతుల్లో 3×4) టాప్ స్కోరర్. ఛేదనలో పంజాబ్ 7 వికెట్లకు 184 పరుగులే పరిమితమైంది. శశాంక్ సింగ్ (61 నాటౌట్; 30 బంతుల్లో 3×4, 6×6) పోరాటం వృధా అయింది.
ఎన్నో ఏళ్ల స్వప్నం నెరవేరడంతో మైదానంలోనే విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు. చివరి ఓవర్లో ఆర్సీబీ గెలుపు ఖాయమైన క్షణాల్లో కోహ్లీకి కన్నీళ్లు ఆగలేదు. ఒకవైపు ఫీల్డింగ్ చేస్తూనే.. తన్నుకొస్తున్న ఉద్వేగాన్ని ఆపుకునే ప్రయత్నం చేశాడు. ఇక చివరి బంతి పడ్డాక మోకాళ్లపై కూర్చుని ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుని ఏడ్చేశాడు. ఆ సమయంలో ఆర్సీబీ ప్లేయర్స్ కోహ్లీని చుట్టుముట్టి అభినందించారు. అనంతరం ఆటగాళ్లతో కింగ్ తన ఆనందాన్ని పంచుకున్నాడు.
Also Read
- CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
- Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
- Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
- Pakistan: "మక్కా ఒప్పందం అండగా లేదు".. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
విరాట్ భావోద్వేగానికి గురైన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫాన్స్ అందరూ కూడా కోహ్లీకి కంగ్రాట్స్ చెబుతున్నారు. మరోవైపు మ్యాచ్ విజయం అనంతరం ఫాన్స్ కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి. మైదానంలో అయితే ఈలలు, కేకలు వేస్తూ సందడి చేశారు. నరేంద్ర మోడీ స్టేడియం మొత్తం కోహ్లీ మేనియాతో ఊగిపోయింది. ఫాన్స్ మాత్రమే కాదు క్రికెట్ దిగ్గజాలు, ఒకప్పటి ఆర్సీబీ ప్లేయర్స్ క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ కూడా తెగ ఆనందపడిపోయారు. బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి రిషి సునాక్ అయితే తెగ ఎంజాయ్ చేశారు.
Only Virat Kohli fans are allowed to touch the like button !!! ❤️#IPLFinal Congratulations RCB@GiveRep
pic.twitter.com/fIqRqn09EZ— Manoj Verma (@Manojve1228) June 3, 2025
తాజావార్తలు
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!