RCB Victory Parade: నేడు బెంగళూరులో ఆర్సీబీ విక్టరీ పరేడ్.. ఇక ఎర్ర సముద్రమే!
- 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర
- ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన ఆర్సీబీ
- విజయాలు, పరాజయాల్లో ఎన్నో ఏళ్లుగా జట్టునేతోనే ఫ్యాన్స్
- ఫ్యాన్స్ కోసమే ప్రత్యేకంగా విక్టరీ పరేడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. మంగళవారం రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్లో 6 పరుగుల తేడాతో గెలిచిన ఆర్సీబీ.. ఐపీఎల్ 2025 టైటిల్‌ను కైవసం చేసుకుంది. మూడు సార్లు ఐపీఎల్ ఫైనల్లో భంగపడ్డ ఆర్సీబీ.. నాలుగో ప్రయత్నంలో ట్రోఫీని ఒడిసి పట్టింది. ఆర్సీబీ ఐపీఎల్ విజేతగా నిలవడంతో ఫాన్స్ సంబరాలు అంబరాన్ని అంటాయి. విజయాలు, పరాజయాల్లో ఎన్నో ఏళ్లుగా జట్టునేతోనే ఉన్న అభిమానులతో కలిసి సంబరాలు చేసుకొనేందుకు ఆర్సీబీ ఫ్రాంఛైజీ బెంగళూరులో విక్టరీ పరేడ్ నిర్వహిస్తోంది.
బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆర్సీబీ విక్టరీ పరేడ్ ప్రారంభం కానుంది. బెంగళూరులోని విధాన సౌధ వద్ద మొదలవనున్న విక్టరీ పరేడ్.. చిన్నస్వామి స్టేడియం వరకు సాగుతుంది. పరేడ్‌లో భారీ సంఖ్యలో ఫ్యాన్స్ పాల్గొననున్నారు. రెడ్ జెర్సీతో ఆ మార్గం మొత్తం ఎర్ర సముద్రాన్ని తలపించనుంది. పరేడ్‌లో పాల్గొనేందుకు ఫాన్స్ ఇప్పటికే సిద్దమయ్యారు. ఇందులో పలువురు ప్రముఖులు కూడా పాల్గొననున్నారని తెలుస్తోంది. ఈ కార్యక్రమంను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, జియో హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ కానుంది.
Also Read
- Mushroom Onion Pakoda: ఈజీ స్నాక్ రెసిపీ..10 నిమిషాల్లో కరకరలాడే 'మష్రూమ్ ఆనియన్ పకోడీ'.! చేసేయండి ఇలా..
- ప్రీమియం ఫీచర్లు బడ్జెట్ ధరలో.. 50MP OIS కెమెరా, సూపర్ AMOLED డిస్ప్లేతో Samsung Galaxy F70 Pro 5G లాంచ్..!
- KTR: ప్రచార హామీలు మరిచారా.? జాబ్ క్యాలెండర్ ఎక్కడంటూ ప్రభుత్వంపై ఫైర్.!
- Medak: నకిలీ బాబా బాగోతం.. యువతిని పెళ్లి చేసుకుని, గుప్తనిధుల పేరుతో లక్షలు కాజేసిన కేటుగాడు..!
Also Read: IPL 2025 Awards: ఐపీఎల్ విజేత ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా.. అవార్డ్స్ ఫుల్ లిస్ట్ ఇదే!
‘ఈరోజు బెంగళూరులో ఆర్సీబీ విక్టరీ పరేడ్ ఉంది. 12th మెన్ ఆర్మీ (ఫాన్స్) ఇది ప్రత్యేకంగా మీకోసమే. మీ ప్రతి ఉత్సాహం, ప్రతి కన్నీటి చుక్క, ప్రతి సంవత్సరం కోసమే ఈ పరేడ్. లాయల్టీనే రాయల్టీ. ఈ కిరీటం మీదే’ అని ఆర్సీబీ ట్వీట్లో పేర్కొంది. విక్టరీ పరేడ్ ఆర్సీబీ ఫాన్స్ కోసమే ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు ఫ్రాంఛైజీ యాజమాన్యం తెలిపింది. ఐపీఎల్లో ఏ జట్టుకు లేని ఫ్యాన్ బేస్ ఆర్సీబీకి ఉందన్న విషయం తెలిసిందే. 2008 నుంచి కప్ కొట్టకున్నా.. విజయాలు, పరాజయాల్లో అభిమానులు ఆర్సీబీతోనే ఉన్నారు. మ్యాచ్ ఎక్కడ జరిగినా స్టేడియం మొత్తం ఆర్సీబీ అభిమానులే ఉంటారు.
🚨 RCB Victory Parade in Bengaluru ‼️
This one’s for you, 12th Man Army.
For every cheer, every tear, every year.
𝐋𝐨𝐲𝐚𝐥𝐭𝐲 𝐢𝐬 𝐑𝐨𝐲𝐚𝐥𝐭𝐲 𝐚𝐧𝐝 𝐭𝐨𝐝𝐚𝐲, 𝐭𝐡𝐞 𝐜𝐫𝐨𝐰𝐧 𝐢𝐬 𝐲𝐨𝐮𝐫𝐬.🏆More details soon… pic.twitter.com/fMWuCGkVWX
— Royal Challengers Bengaluru (@RCBTweets) June 4, 2025
తాజావార్తలు
-
Mushroom Onion Pakoda: ఈజీ స్నాక్ రెసిపీ..10 నిమిషాల్లో కరకరలాడే ‘మష్రూమ్ ఆనియన్ పకోడీ’.! చేసేయండి ఇలా..
-
Mumbai Indians Captain: ముగ్గురు దిగ్గజాల సపోర్ట్.. తెలుగు ఆటగాడికి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ!
-
Agadha Trailer: రక్తం, రహస్యాలు, దైవిక శక్తుల పోరు.. వణుకు పుట్టిస్తున్న ఎంఎస్ రాజు ‘అగధ’ ట్రైలర్!
-
ప్రీమియం ఫీచర్లు బడ్జెట్ ధరలో.. 50MP OIS కెమెరా, సూపర్ AMOLED డిస్ప్లేతో Samsung Galaxy F70 Pro 5G లాంచ్..!
-
Karnataka Cabinet Expansion 2026: కర్ణాటకలో నేడు మంత్రివర్గ విస్తరణ.. 20 మంది కొత్త మంత్రుల జాబితా విడుదల
ట్రెండింగ్
-
Best Cricketing Brain: ఎంఎస్ ధోనీ కాదు, అతడే బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్.. ఆ టీమిండియా మాజీ స్టార్ ఎవరంటే?
-
Tata దూకుడు మాములుగా లేదుగా.. Nexon నుంచి ప్రీమియం Avinya X వరకు భారీ ప్లాన్..!
-
India Medal Tally: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ చరిత్ర.. 39 పతకాలతో ఘన ముగింపు.. మెడల్స్ ఫుల్ లిస్ట్ ఇదే!
-
8100mAh భారీ బ్యాటరీ, 108MP కెమెరా వంటి క్రేజీ ఫీచర్లతో Honor X7e Plus (4G) లాంచ్..!
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!