NTV Telugu Site icon

Dinesh Karthik Coach: బిగ్ బ్రేకింగ్.. కోచ్‌గా దినేశ్‌ కార్తీక్‌!

Dinesh Karthik Coach

Dinesh Karthik Coach

Dinesh Karthik Is a Batting Coach for RCB in IPL 2025: ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌ దినేశ్‌ కార్తీక్‌ కోచ్‌ అవతారం ఎత్తనున్నాడు. ఐపీఎల్ ప్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) మెన్స్ జట్టుకు బ్యాటింగ్‌ కోచ్‌గా ఎంపికయ్యాడు. అంతేకాదు ఆర్‌సీబీ మెంటార్‌గా కూడా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ విషయాన్ని ఆర్‌సీబీ ప్రాంచైజీ తన ఎక్స్ వేదికగా తెలిపింది. ఐపీఎల్ 2025లో దినేశ్‌ కార్తీక్‌ కొత్త విధుల్లో చేరతాడని ఆర్‌సీబీ పేర్కొంది. ఐపీఎల్ 2024లో ఆర్‌సీబీ తరఫున ఆడిన డీకే.. సీజన్ అనంతరం రిటైర్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈ ఏడాదే ఐపీఎల్‌కు దినేశ్‌ కార్తీక్‌ రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో (2008, 2009, 2010) ఐపీఎల్‌ ప్రస్తానాన్ని ప్రారంభించిన డీకే.. 2011లో కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ తరఫున ఆడాడు. 2012, 2013లో ముంబై ఇండియన్స్‌కు ఆడిన కార్తీక్‌.. 2014లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడాడు. 2015లో ఆర్‌సీబీ.. 2016, 2017లో గుజరాత్‌ లయన్స్‌.. 2018, 2019, 2020, 2021లలో కేకేఆర్‌ తరఫున ఆడాడు. 2022, 2023, 2024లలో ఆర్‌సీబీకి ఆడాడు. ఐపీఎల్‌ ఆరంభ ఎడిషన్‌ నుంచి ఆడిన అతి కొద్ది మంది క్రికెటర్లలో డీకే ఒకడు.

Also Read: Gold Price Today: స్థిరంగా బంగారం ధరలు.. నేడు తులం ఎంతుందంటే?

ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో దినేష్ కార్తీక్‌ రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్‌ శర్మతో పాటు డీకే ఐపీఎల్‌లో 257 మ్యాచ్‌లు ఆడారు. ఇప్పటివరకు జరిగిన 17 ఎడిషన్లలో పాల్గొన్న కార్తీక్‌.. కేవలం రెండు మ్యాచ్‌లను మాత్రమే మిస్‌ అయ్యాడు. డీకే తన ఐపీఎల్‌ కెరీర్‌లో 257 మ్యాచ్‌లు ఆడి 4842 పరుగులు చేశాడు. ఇందులో 22 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. కార్తీక్‌ 145 క్యాచ్‌లు, 37 స్టంపింగ్‌లు చేశాడు.